‘సైరా’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నయనతార, అమితాబ్ బచ్చన్ మిస్సింగ్..

సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పడానికి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. బాహుబలితో మొదలైన ప్రభంజనం.. కేజీయఫ్ సినిమాతో మరింత పెరిగిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 4:27 PM IST
‘సైరా’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నయనతార, అమితాబ్ బచ్చన్ మిస్సింగ్..
నయనతార అమితాబ్ బచ్చన్ (Source: Twitter)
  • Share this:
సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పడానికి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. బాహుబలితో మొదలైన ప్రభంజనం.. కేజీయఫ్ సినిమాతో మరింత పెరిగిపోయింది. సాహో సంచలనాలు నమోదవుతున్న సమయంలోనే ఇప్పుడు సైరా కూడా వచ్చేస్తుంది. అయితే సైరా ఈవెంట్ అంత ఘనంగా జరిగినా కూడా అందులో ఇద్దరు మాత్రం మిస్ అయ్యారు. చిత్రయూనిట్ మొత్తం హాజరైనా కూడా నయనతార, అమితాబ్ బచ్చన్ మాత్రం కనబడలేదు. నయనతార ప్రస్తుతం రజినీకాంత్ దర్బార్ సినిమాలో నటిస్తుంది. దీనికోసం దుబాయ్ షెడ్యూల్ చేస్తుంది నయన్.
Amitabh Bachchan and Nayanthara missing in Sye Raa Narasimha Reddy teaser launch event in Mumbai pk సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పడానికి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. బాహుబలితో మొదలైన ప్రభంజనం.. కేజీయఫ్ సినిమాతో మరింత పెరిగిపోయింది. sye raa twitter,amitabh bachchan sye raa,nayanthara sye raa teaser launch missing,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy teaser launch,sye raa teaser,sye raa narasimha reddy trailer,sye raa teaser launch,sye raa narasimha reddy,sye raa narasimha reddy movie,sye raa teaser launch event,sye raa teaser launch at mumbai,sye raa trailer,live sye raa narasimha reddy teaser launch,sye raa narasimha reddy teaser launch highlights,sye raa live,sye raa,telugu cinema,సైరా,సైరా టీజర్ లాంఛ్,సైరా అమితాబ్ బచ్చన్,సైరా నయనతార,తెలుగు సినిమా,సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్
సైరా నరసింహారెడ్డి పోస్టర్ (Source: Twitter)

ఇక అమితాబ్ కూడా ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో ఆయన కూడా ఈ వేడుకకు రాలేకపోయాడు. అయితే చిరంజీవితో పాటు మిగిలిన వాళ్లను కూడా అమితాబ్ గురించి అడిగారు. వాళ్లు కూడా మెగాస్టార్ రోల్ గురించి మాట్లాడుకున్నారు. నయనతార కూడా అక్కడ లేకపోయినా టీజర్లో మాత్రం అదిరిపోయింది. కచ్చితంగా సినిమాలో ఆమె పాత్ర మరింత రసవత్తరంగా ఉంటుందని టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య పాత్రలో నటిస్తుంది నయనతార. మొత్తానికి సైరా లాంఛ్ ఈవెంట్ బాంబేలో భారీగానే జరిగింది. దేశవ్యాప్తంగా సైరా టీజర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు