Home /News /movies /

AMITABH BACHCHAN AND DEEPIKA PADUKONE DEMANDS HUGE FOR PRABHAS NAG ASHWIN MOVIE SR

Vyjayanthi Movies : ఆ ఇద్దరి కోసం 50 కోట్లను వెచ్చిస్తోన్న వైజయంతీ మూవీస్..

Vyjayanthi Movies Photo : Twitter

Vyjayanthi Movies Photo : Twitter

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ ప్యాన్ ఇండియన్ సినిమా త్వరలోనే మొదలుకానుంది.

  రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ ప్యాన్ ఇండియన్ సినిమా త్వరలోనే మొదలుకానుంది. కరోనా సమస్య లేకుండా ఉంటే ఈ భారీ బడ్జెట్ సినిమా ఈపాటికే మొదలుకావాల్సింది. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకుంటున్నాడు.  అందులో భాగంగా ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైనా దీపికా పదుకొనేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.  ఇక తాజాగా ఈసినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది.

  అయితే ఈ సినిమా గురించి.. ఈ సినిమాలో నటిస్తోన్న బిగ్ బి అమితాబ్ రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ డిమాండ్‌ని బట్టి ఒక్కో సినిమాకి ఆయన తీసుకునే పారితోషికం అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తుంటుంది. ఆయన ప్రభాస్‌ సినిమా కోసం అక్షరాల 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ని తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అమితాబ్ 40 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. సినిమా మొత్తమ్మీద ఆయన నిడివి కేవలం 25 నిమిషాలు మాత్రమేనట. అయితే 25 నిమిషాలకు అమితాబ్ రూ.25 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారట. అంతేకాదు అమితాబ్‌ అడిగిన రెమ్యూనరేషన్‌ని మరో మాట లేకుండా వైజయంతి సంస్థ ఇచ్చేందుకు అంగీకరించిందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోన్న దీపికా కూడా 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థం 50 కోట్లను పారితోషికాల రూపంలో చెల్లిస్తుంది.

  తెలుగులో అమితాబ్ నటిస్తోన్న మూడో సినిమా ఇది. ఆయన గతంలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మనంలో నటించారు. అయితే మనంలో ఆయనది గెస్ట్ రోల్ మాత్రమే. ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరాలో పూర్తి నిడివి ఉన్న పాత్రలో అమితాబ్ అలరించారు అమితాబ్. ఇక తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో అత్యంత భారీగా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమాతో అమితాబ్ మరోసారి తెలుగువారిని  పలకరించనున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. ఇక ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉండటంతో మొదట సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకుంటున్నారని గతంలో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు.. ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పేరు తెరపైకొచ్చింది. రెహమాన్ ఇటీవల కాలంలో తెలుగులో ఏ సినిమా చేయలేదు. అంతేకాదు ఆయన ఒక తమిళ్‌లో తప్ప ఏ భాషాల్లోను ఎక్కువుగా సంగీతం అందిచట్లేదు. ఆయన చేసిన చివరి హిందీ సినిమా  దిల్ బెచారా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆఖరి చిత్రానికి రెహమాన్ బాణీలు సమకూర్చగా.. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నాగ్ తన సినిమాకు రెహమాన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. రెహమాన్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే అయినా.. ఆయన ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ దక్కుతుందనే నమ్మకంతో చిత్రబృందం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా 2022లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. ప్రస్తుతం ప్రభాస్‌ ఇటలీలో జరుగుతున్న 'రాధేశ్యామ్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Prabhas Latest News, Tollywood news

  తదుపరి వార్తలు