news18-telugu
Updated: August 5, 2020, 5:42 PM IST
అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే దీని బారిన సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందిరినీ కరోనా కాటుకు గురవుతున్నారు. ఇక బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక బిగ్‌బీ ఫ్యామిలీలో అభిషేక్ మినహా అందరు కరోనా నుంచి కోలుకోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రభుత్వ మార్గదర్శకల ప్రకారం మరో వారం పది రోజులు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇది అమితాబ్‌కు అంతగా రుచించడం లేదు. హోం క్వారంటైన్ సందర్భంగా ఇంట్లో ఓ మూలకు పరిమితం కావడం. ఏకాంతంగా గడపడం .. జైల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది అంటూ తన హోం క్వారంటైన్ అనుభవాలను తన బ్లాగ్‌లో రాసుకున్నారు.

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్ (File)
తన సొంతింటిలో ఒంటిరిగా ఉండటం.. ఇంట్లో వాళ్లను కలుసుకునే అవకాశం లేకపోవడం జైల్లో ఉన్న వారిని పలకరించినట్టు సెపరేట్ టైమింగ్ అంటూ తన బాధను బ్లాగ్ వేదికగా వెల్లగక్కారు. ఈ హోం క్వారంటైన్లో సినిమాలు చూస్తున్నానంటూ చెప్పారు. మరోవైపు తనకు తన ఇంట్లో వాళ్లకుగా అడ్డుగా గాజు గ్లాస్‌తో ఓ తెరను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇంట్లో వాళ్లతో అంతా సైగలతోనే పని జరుగిపోతుందని బిగ్‌బీ వెల్లడించారు. కొద్ది దూరంలో కుటుంబ సభ్యులున్నా.. ఇంకా దూరమే అంటూ బ్లాగ్‌లో కొంచెం కవితాత్మకంగా తన పరిస్థితిని వివరించారు. రక్షా బందన్ సందర్భంగా తనకు సంబంధించిన వాళ్లు అభిమనులు తనకు రాఖీలు పంపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 5, 2020, 5:29 PM IST