తుస్సుమన్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ : అమితాబ్, ఆమీర్‌లకు ఘోర పరాభవం

దీపావళి కానుకగా విడుదలైన అమితాబ్, ఆమీర్‌ల ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ మూవీ వీకెండ్ తర్వాత థియోటర్స్‌లో తుస్సు మంది. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ సినిమా ఊదరగొట్టిన ఈ సినిమా ఆ యేడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

news18-telugu
Updated: November 14, 2018, 4:03 PM IST
తుస్సుమన్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ : అమితాబ్, ఆమీర్‌లకు ఘోర పరాభవం
2.0 మూవీ కంటే ముందు అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్‌లు హీరోలుగా నటించిన మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోయింది.
  • Share this:
దీపావళి కానుకగా విడుదలైన అమితాబ్, ఆమీర్‌ల ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ మూవీ వీకెండ్ తర్వాత థియోటర్స్‌లో తుస్సు మంది. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ సినిమా ఊదరగొట్టిన ఈ సినిమా ఆ యేడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

మొదటిరోజు అన్ని భాషల్లో కలిసి రూ.52 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టిన ఈ మూవీ..డివైడ్ టాక్ కారణంగా సెకండ్ డే నుంచి ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇక సినిమా ఆడుతున్న థియేటర్ల వైపు జనాలు అసలు చూడటం లేదు. దీంతో సోమవారం పలు షోలను రద్దు కూడా చేశారు. మంగళవారం ఈ మూవీ కనీసం రూ.5 కోట్లను కూడా రాబట్టకపోవడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.

థగ్స్ ఆఫ్ హిందోస్థాన్


దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిపోయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ వివారాలను బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.హిందీ వెర్షన్ విషయానికొస్తే...గురువారం రూ.5.75 కోట్లు, శుక్రవారం రూ. 28.25 కోట్లు, శనివారం రూ.22.75 కోట్లు, ఆదివారం రూ.17.25 కోట్లు, సోమవారం రూ. 5.50 కోట్లు, మంగళవారం రూ.4.35 కోట్లు..మొత్తంగా రూ.128.85 కోట్లు వసూళు చేసింది.

ఇక సౌత్‌లో తమిళ్, తెలుగు విషయానికొస్తే...మొత్తంగా రూ.4.90 కోట్లు వసూళు చేసింది. మొత్తానికి ‘థగ్స్’ దెబ్బకు ఈ మూవీని కొన్న బయ్యర్స్ నిండా మునిగారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 14, 2018, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading