లవ్‌లో ఉన్నట్లు నిర్ధారించిన సూపర్ స్టార్ కూతురు..వైరల్ అవుతోన్న ఫోటో

హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను..తెలుగు వారికి మరోసారి పరిచయం చేయనక్కర లేదు. అమీర్ వినూత్న సినిమాలు చేస్తూ.. దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకున్నారు. అదీ అలా ఉంటే ఆయన కూతురు ఇరా..లవ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

news18-telugu
Updated: June 13, 2019, 5:41 PM IST
లవ్‌లో ఉన్నట్లు నిర్ధారించిన సూపర్ స్టార్ కూతురు..వైరల్ అవుతోన్న ఫోటో
ప్రియుడితో ఇరా ఖాన్ Photo: Instagram.com/khan.ira
  • Share this:
హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను..తెలుగు వారికి మరోసారి పరిచయం చేయనక్కర లేదు. ఆయన వినూత్న సినిమాలతో దేశం అంతా అభిమానుల్ని సంపాదించుకున్నారు. 'లగాన్', 'తారే జమీన్ పర్' లాంటీ కొత్త తరహా కథలతో అమీర్ అందరికంటే భిన్నం అని నిరూపించుకున్నారు. అదీ అలా ఉంటే ఆయన మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ ప్రేమలో పడిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ వార్తలకు బలం చేకూర్చుతూ..ఇరా కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త మరింత హల్ చల్ చేస్తోంది. మ్యూజిషియన్ మిశాల్ కిర్పలానితో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని నిర్ధారిస్తూ తాజాగా ఈ విషయంపై స్పందించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇరా తన సోషల్ మీడియూ అకౌంట్‌ ఇన్స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఆమెను ఓ అభిమాని ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా..? అని ప్రశ్నించగా, బదులుగా.. ఇరాఖాన్ ఓ ఫోటోతో జవాబిచ్చింది.
ఆ ఫోటోలో తన బాయ్‌ఫ్రెండ్ మిశాల్‌ను కౌగిలించుకుంటూ..వయ్యారాలు ఒలకబోసింది. ఈ విధంగా గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ ఇరా ఓ ఫోటోతో తాను లవ్‌లో ఉన్నట్లు కన్ఫామ్ చేసేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.Published by: Suresh Rachamalla
First published: June 13, 2019, 11:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading