హోమ్ /వార్తలు /సినిమా /

Amigos Trailer Talk Review: ‘అమిగోస్’ ట్రైలర్ టాక్ రివ్యూ.. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ నట విన్యాసం..

Amigos Trailer Talk Review: ‘అమిగోస్’ ట్రైలర్ టాక్ రివ్యూ.. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ నట విన్యాసం..

కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

NKR - Kalyan Ram Nandamuri - Amigos Trailer Talk Review: కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌ లేని కళ్యాణ్ రామ్ గతేడాది కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వంలో చేసిన ‘బింబిసార’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో పలకరించనున్నారు. కళ్యాణ్ రామ్‌కు సంబంధించిన సిద్ధార్థ్‌, మంజునాథ్‌, గ్యాంగ్ స్టర్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు టీజర్‌‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Kalyan Ram - Amigos Trailer : కళ్యాణ్ రామ్ మాస్ సినిమాలు చేస్తూనే అందులో వెరైటీ కాన్సెస్ట్‌లకు పెద్ద పీఠ వేయడం కళ్యాణ్ రామ్ స్పెషాలిటీ. గతేడాది  బింబిసారతో హిట్‌తో బంపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ‘అమిగోస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కొత్త సినిమాను చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి  2023లో వస్తోన్న మూడో  చిత్రం. ఇప్పటికే విడుదలైన సినిమాలో మూడు పాత్రలకు సంబంధించిన కళ్యాణ్ రామ్ లుక్స్‌‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే సిద్దార్ధ్ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలను పరిచయం చేసిన చిత్ర యూనిట్.. టీజర్‌లో మూడో పాత్ర మైఖేల్‌ను పరిచయం చేసింది.

ఇతనో గ్యాంగ్ స్టర్. తనలాగే ఉండే మరో ఇద్దరినీ వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత అతను వాళ్లను ఏం చేసాడనేదే ‘అమిగోస్’ మూవీ స్టోరీలా ఉంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఈ ఇద్దరిని ఎలా వాడుకొని NIA కళ్లు కప్పాడనేదే ఈ సినిమా ట్రైలర్‌లో చూపించారు.  ఈ సినిమాలో హీరో కమ్ విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. ఇక మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మ్యానరిజం‌ చూపించాడు. రీసెంట్‌గా బింబిసారలో కూడా రెండు విభిన్న పాత్రల్లో అలరించిన ఈ నందమూరి హీరో.. ఇపుడు మరో డిఫరెంట్ పాత్రలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ యెకా యెకా ఫుల్ వీడియో సాంగ్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అంటూ రీమిక్స్ సాంగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

K Viswanath: విశ్వనాథ్‌లోని నటుడిని వెండితెరకు పరిచయం చేసిన నటుడు కమల్ హాసన్..

బాబాయి నందమూరి బాలకృష్ణ హీరోగా దివ్యభారతి హీరోయిన్‌గా నటించిన ధర్మక్షేత్రం’ చిత్రానికీ ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న విడుదలైంది.  ఇళయరాజా స్వరాలు అందించారు. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో దివంగత వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ‘ఎన్నో రాత్రులొస్తాయి’ పాట అప్పటికీ ఇప్పటికీ ఎంతో పాపులర్. తాజాగా ఈ పాటను ‘అమిగోస్’లో రీమిక్స్ చేశారు. అప్పట్లో ఎస్పీ బాలు, చిత్ర పాడిన ఈ పాటను ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌తో పాటు సమీరా భరద్వాజ్ ఆలపించారు. గతంలో కళ్యాణ్ రామ్.. బాలయ్య నటించిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ .. ‘అరే ఓ సాంబ’ పాటను ‘పటాస్’లో రీమిక్స్ చేసి హిట్ అందుకున్నారు.

ఇపుడు అదే బాటలో బాలయ్య సూపర్ హిట్ పాటలను ‘అమిగోస్‌’లో పెట్టారు. మరి సెంటిమెంట్ వర్కౌట్ అయి ఈ  చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కర్నూలు శ్రీరామ థియేటర్‌లో నిర్వహించి ట్రైలర్‌ను కాసేటి క్రితమే విడుదల చేశారు.

అమిగోస్ సినిమా విషయానికొస్తే..   మొత్తంగా కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో కనిపించని డిఫరెంట్ అవతారంలో కనిపించి సినిమాపై అంచనాలు పెంచేలా చేసాడు. ఇప్పటికే ‘అమిగోస్’ మూవీ నుంచి కళ్యాణ్ రామ్‌కు సంబంధించిన సిద్ధార్థ్‌ లుక్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో ఒక పాత్ర  ఎంటర్‌ ప్రెన్యూర్  (యువ పారిశ్రామిక వేత్త) .  మంజునాథ్‌ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. మైఖేల్ అనే మూడు పాత్రల్లో మెప్పించారు. కోల్‌కత్తాకు చెందిన మైఖేల్ కమ్ విపిన్ పాత్రలో కళ్యాణ్ పాత్ర ఎలాంటిదో ఈ ట్రైలర్‌లో చూపించారు. డోపెల్‌గాంజర్స్ అంటే ఒకే రకంగా ఉండేవాళ్లు అని అర్ధం. రక్త సంబంధం లేకుండా ఒకే రకంగా ఉండేవాళ్లు అని అర్ధం. ఈ సినిమాలో మనుషులు పోలిన మనుషులు ఎదురు పడితే అరిష్టం అంటూ హీరో అమ్మ చెప్పే  డైలాగ్ బాగుంది. మనం బ్రదర్స్ కాదు.. ఫ్రెండ్స్ కాదు.. కేవలం లుక్ లైక్స్ అంటూ కళ్యాణ్ రామ్ భయానక రసంలో చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

K Viswanath: పూర్ణోదయ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో కళా తపస్వీ విశ్వనాథ్ ప్రత్యేక అనుబంధం..

ఒకే నటుడు మూడు పాత్రల్లో కనిపించడం అనేది కళ్యాణ్ రామ్‌కు ఒక రకంగా ఛాలెంజింగ్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తొలిసారి హీరోగా కళ్యాణ్ రామ్ నందమూరి ఈ ఛాలెంజింగ్ రోల్ చేశారు. ఈ చిత్రంతో రాజేంద్ర అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న 14వ సినిమా ‘అమిగోస్’. హీరోగా కళ్యాణ్‌ రామ్‌కు 19వ సినిమా. నటుడిగా 22వ చిత్రం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ‘అమిగోస్’తో కళ్యాణ్ రామ్ మరో హిట్టు అందుకునేలా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ మరోవైపు నవీన్‌ మేడారం దర్శకత్వంలో డెవిల్‌ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇతను బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపంచనున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

First published:

Tags: Amigos Movie, Ashika Ranganath, Kalyan Ram Nandamuri, NKR, Tollywood

ఉత్తమ కథలు