హోమ్ /వార్తలు /సినిమా /

Jr NTR - Kalyan Ram: అమిగోస్ ప్రీ రిలీజ్‌లో ఆ ఒక్కటే నిరాశ.. తారకరత్న హెల్త్ పై నో అప్‌డేట్..

Jr NTR - Kalyan Ram: అమిగోస్ ప్రీ రిలీజ్‌లో ఆ ఒక్కటే నిరాశ.. తారకరత్న హెల్త్ పై నో అప్‌డేట్..

కళ్యాణ్ రామ్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడని ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడని ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ (Twitter/Photo)

Amigos Pre Release Event - Jr NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైదరాబాద్‌లో గ్రాండ్‌‌గా జరిగింది. ఈ వేడుకలో నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Amigos Pre Release Event - Jr NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైదరాబాద్‌లో గ్రాండ్‌‌గా జరిగింది. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ సినిమా దర్శకుడు, అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ వేదికలపై రెపరెప లాడటం వెనక అభిమానుల ఆశీర్వాదం ఉంది. దాంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్స్‌తో పాటు ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ లెవల్లో ఈ స్థాయి సక్సెస్ వెనక రాజమౌళి కృషి ఉందన్నారు. ఆయన మమ్మల్ని సినిమాల్లో తీసుకొబట్టే మాకీ ఖ్యాతి దక్కిందన్నారు.

అమిగోస్ ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి అభిమానులతో పాటు అందరు ఈ వేదికపై తారకరత్న హెల్త్ కండిషన్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్‌ ఇద్దరు ఏదైనా హెల్త్ అప్‌డేట్ ఇస్తారని అందరు ఆశించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. అసలు తారకరత్న గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. గతంలో సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ జరిగినపుడు..రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన హెల్త్ అప్‌డేట్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రతి ఒక్క మెగా హీరో కూడా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితులను వివరిస్తూనే వచ్చారు. కానీ ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్‌‌లు బెంగళూరులో చికిత్స తీసుకొంటున్న తారకరత్నను ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు  కూడా పర్సనల్‌గా త మసోదరుడి ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకుంటూనే ఉన్న.. అమిగోస్ వంటి ప్రీ రిలీజ్ వేడుకలో తారకరత్న గురించి మాట్లాడి అభిమానులను ఆందోళనకు గురి చేయడం ఎందుకనే ఉద్దేశ్యంతోనే ఈ వేడుకలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడలేదనే విషయం స్పష్టమవుతోంది. ఏది ఏమైనా ‘అమిగోస్’ వంటి బడా సినిమా వేడుకలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఈ నందమూరి సోదరులు క్లారిటీ ఇస్తే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

RajaShekar - Sreeleela: హీరో రాజశేఖర్ కు శ్రీ లీలకు మధ్యన ఈ సంబంధం తెలుసా..

అమిగోస్ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహించారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి  2023లో వస్తోన్న మూడో  చిత్రం.ఇప్పటికే విడుదలైన సినిమాలో మూడు పాత్రలకు సంబంధించిన కళ్యాణ్ రామ్ లుక్స్‌‌తో పాటు టీజర్‌,ట్రైలర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. తాత ఎన్టీఆర్, బాబాయి బాలయ్య, తమ్ముడు ఎన్టీఆర్ తర్వాత ఒకే సినిమాలో మూడు పాత్రలతో పాటు అందులో ఒకటి ప్రతి నాయక ఛాయలున్న పాత్ర చేసిన హీరోలుగా నందమూరి హీరోలు రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి. మూడు పాత్రలతో పాటు హీరో కమ్ విలన్‌గా నటించడం అనేది చాలా రేర్‌గా జరగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన పాత్రను కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో పోషించడం విశేషం.

అమిగోస్‌లో  మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మ్యానరిజం‌ చూపించాడు కళ్యాణ్ రామ్ . రీసెంట్‌గా బింబిసారలో కూడా రెండు విభిన్న పాత్రల్లో అలరించిన ఈ నందమూరి హీరో.. ఇపుడు మరో డిఫరెంట్ పాత్రలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ యెకా యెకా ఫుల్ వీడియో సాంగ్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అంటూ రీమిక్స్ సాంగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

First published:

Tags: Amigos Movie, Jr ntr, Kalyan Ram Nandamuri, Mythri Movie Makers, NKR, Taraka Ratna, Tollywood

ఉత్తమ కథలు