హోమ్ /వార్తలు /సినిమా /

Amigos Movie Review:‘అమిగోస్’ మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ మరో హిట్టు అందున్నాడా..

Amigos Movie Review:‘అమిగోస్’ మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ మరో హిట్టు అందున్నాడా..

Amigos Twitter

Amigos Twitter

Amigos Movie Review: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. రెగ్యులర్ మాస్ సినిమాలు చేస్తూనే డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో అటు హీరోగా, నిర్మాత సత్తా చాటుతున్నాడు. తాజాగా ఈయన ‘అమిగోస్’ అంటూ మరో డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తొలిసారి తన కెరీర్‌లో మూడు పాత్రల్లో కనిపించిన కళ్యాణ్ రామ్.. ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర మరో సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : అమిగోస్ (Amigos)

నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్ (త్రిపాత్రాభినయం), ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయ ప్రకాష్, నితిన్ ప్రసన్న, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు..

ఎడిటర్: తమ్మిరాజు

సినిమాటోగ్రఫీ:S. సౌందరరాజన్

సంగీతం: జిబ్రాన్

నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యెర్నెనీ, వై.రవి శంకర్)

దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి

విడుదల తేది : 10/2/2023

కళ్యాణ్ రామ్ (Kalyan Ram Amigos) గతేడాది  బింబిసార(Bimbisara)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన అమిగోస్ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులు ముందకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై  మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీతో కళ్యాణ్ రామ్ మరో సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

సిద్ధార్ధ్ (కళ్యాణ్ రామ్ -1) ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తన తండ్రికి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూ ఉంటాడు. అయితే ఓ సారి ఓ వ్యక్తి ద్వారా డోపెల్‌గ్యాంగర్స్  గురించి తెలుసుకుంటాడు. డోపెల్ గ్యాంగర్స్ అంటే లుక్ లైక్ సేమ్.  రక్త సంబంధం లేకుండా ఒకే రకంగా ఉండేవాళ్లు అని అర్ధం.ఇతను నెట్‌లోకి వెళ్లి తనలాగే ఎవరైనా డోపెల్ గ్యాంగర్స్ ఉన్నారా అని వెతుకుతాడు. ఈ క్రమంలో అతనికి బెంగళూరులో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మంజునాథ్ (కళ్యాణ్ రామ్ -2) పరిచయమవుతాడు. ఆ తర్వాత కోల్‌కతాకు చెందిన ‘మైఖేల్’ (కళ్యాణ్ రామ్ -3) వీరికి జత కలుస్తాడు. వీళ్లిద్దరు గోవాలో తొలిసారి కలుసుకుంటారు.  మైఖేల్ అలియాస్ విపిన్ రాయ్  ఓ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్. ఆ తర్వాత మైఖేల్ అలియాస్ విపిన్ పన్నిన లో ఉచ్చులో సిద్ధార్ధ్, మంజునాథ్ చిక్కుకుంటారు. ఆ తర్వాత మైఖేల్.. సిద్ధార్ధ్ ప్లేస్‌లో సెటిలైపోదామనకుంటాడు.  ఆ తర్వతా సిద్ధార్ధ్, మంజునాథ్.. మైఖేల్ అలియాస్ విపిన్ పన్నిన కుట్ర నుంచి ఎలా బయటపడ్డారా లేదా అనేదే ‘అమిగోస్’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు రాజేంద్ర.. తాను ఇంట్ర్నెట‌్‌లో చదివి ‘డోపెల్ గ్యాంగర్స్’ అనే డిఫరెంట్  సబ్జెక్ట్‌‌‌ను ఎంచుకోవడమే సాహసం.  ప్రపంచంలో తమలాగే ఉండే డోపెల్ గ్యాంగర్స్‌ ఎంత మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఏ డోపెల్ గ్యాంగర్స్ కలుసుకున్నారనే విషయాన్ని బాగానే స్డడీ చేసినట్టు ఈ సినిమా ప్రారంభంలోనే చూపించారు. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్‌లాల ఉండే మరో డోపెల్ గ్యాంగర్.. త్రిష, షారుఖ్, విరాట్ కోహ్లి వంటి సెలబ్రిటీల డోపెల్ గ్యాంగర్స్‌ను ఈ సినిమాలో ఎగ్జాంపుల్‌గా చూపించాడు. అలాంటి కత్తి మీద సాము లాంటి పాయింట్‌తో తనో డోపెల్ గ్యాంగర్స్ కథను అల్లుకున్నాడు. దాన్ని అంతే బాగా తెరపై బాగానే రొటీన్‌ స్క్రీన్ ప్లే‌తో ఎగ్జిక్యూట్ చేసాడు. కళ్యాణ్ రామ్‌తో మూడు డిఫరెంట్ పాత్రలను చేయించడమే కాకుండా..  మూడు పాత్రల్లో విభిన్న నటనను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. హీరో కమ్ విలన్ డ్యూయల్ రోల్స్‌లో వచ్చిన కాన్సెప్ట్‌నే ఈ సినిమాలో అప్లై చేసాడు.  అమిగోస్ అంటే స్నేహితులు అని అర్ధం వచ్చేలా ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాడు.

సినిమా మొత్తంగా స్క్రీన్ పై కళ్యాణ్ రామ్ ఏదో వేషంలో  కనిపిస్తూనే ఉంటాడు. సినిమా ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగినా.. ఆ తర్వాత డోపెల్ గ్యాంగర్స్ గురించి సిద్ధార్ధ్ తెలుసుకోవడం .. ఆ తర్వాత ఈ ముగ్గరు కలవడం అనేది చకా చకా లాగించేసాడు. ఇక ఈ ముగ్గురిలో సిద్ధార్ధ్‌కు ఓ కరీ తింటే ఎలర్జీ వస్తుందనే విషయాన్ని చూపించాడు. అలాగే మంజునాథ్ అనే పాత్రకు చేతికి ఆరో వేలు పెట్టాడు. నిజ జీవితంలో ఇలాంటి డోపెల్ గ్యాంగర్స్‌ ఉంటారో లేదో గానీ తన కథ, స్క్రీన్ ప్లే‌లో ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ముగ్గురిలో ఇద్దరి డిఫరెంట్ మ్యానరిజ్స్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాలా చేసాడు. ఇక ఈ సినిమాకు జిబ్రాన్ అందించిన ఆర్ఆర్ బాగుంది. సెకాండాప్‌లో వచ్చే బాలయ్య, దివ్యభారతిలో ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయి కానీ పాట మాస్‌తో విజిల్స్ వేయించేలా ఉంది. ఫోటోగ్రఫీ రిచ్‌గా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి. మైత్రీ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

నటీనటుల విషయానికొస్తే..

నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా మొత్తం మూడు పాత్రల్లో కనిపిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా మైఖేల్ అలియాస్ విపిన్ రాయ్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అనే రీతిలో విలనిజం పండించాడు. అంతేకాదు కళ్లతోనే  క్రూరత్వం ఎలాంటితో చూపించాడు. ఇక ఎంటర్‌ప్రెన్యూర్ సిద్ధార్ధ్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మంజునాథ్‌ అనే కన్నడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో అమాయకత్వం ప్రదర్శించాడు. ఒక పాత్రలో క్రూరత్వం, మరో పాత్రలో రొమాంటిక్‌గా కనిపిస్తే.. మూడో పాత్రలో అమాయకత్వంతో కూడిన శాంతి రసాన్ని పోషించాడు. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి మూడు డిఫరెంట్ పాత్రల్ని ఈ సినిమాలో చేసి నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. ఒక రకమైన డ్రెస్‌లో కనిపించినా.. మూడు పాత్రల్లో మూడు రకాల వేరియేషన్స్ చూపించాడు. హీరోయిన్‌గా నటించిన ఆషికా రంగనాథ్ .. కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. ఇక హీరోతో ఫస్ట్ నుంచి చివరి వరకు ట్రావెల్ అయ్యే పాత్రలో  బ్రహ్మాజీ నటన బాగుంది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ 

కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం

స్టోరీ లైన్

జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

గ్రాఫిక్స్, ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ 

ఫస్టాఫ్‌లో కాస్తంత సాగతీత

రొటిన్  స్క్రీన్ ప్లే

హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్

చివరి మాట : అమిగోస్..  వన్ మ్యాన్ ఇన్ త్రీ షేడ్స్

రేటింగ్ : 2.75/5

First published:

Tags: Amigos Movie, Kalyan Ram Nandamuri, NKR, Tollywood

ఉత్తమ కథలు