టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr).. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ రావడంతో ఎన్టీఆర్ రేంజ్ వరల్డ్ వైడ్ తెలిసిపోయింది. దేశవిదేశాల్లో ఒక్కసారిగా ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆయనపై అభిమానాన్ని చాటుకుంటూ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలసి ‘‘థ్యాంక్యూ ఎన్టీఆర్, #NTR30 కోసం వేచి ఉండలేకపోతున్నాం’’ అనే బ్యానర్ ను ఎయిర్ జెట్ ద్వారా గాలిలో ఎగరేశారు. ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ పై ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ ఎలా ఉంటుందో తెలిసేలా ఉన్న ఈ వీడియో చూసి నందమూరి ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.
RRR సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమా స్టార్ట్ చేయలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నెక్స్ట్ మూవీ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ మూవీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కనుందని మాత్రం తెలుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకొస్తారా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
AIR PLANE Banner over the heart of world cinema, THE HOLLYWOOD.???? Thanks for a memorable ride called #RRRMovie. Can’t wait for the mass mania of Man of Masses with #NTR30. Our best wishes to @tarak9999, Siva Koratala garu and the whole team. ❤️ Let’s paint the town red on April… https://t.co/OIaJWwJGfX pic.twitter.com/3d7c5v2umD
— NTR FANS USA (@NTRFans_USA) March 20, 2023
NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు కొరటాల శివ. అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన స్క్రిప్ట్ రెడీ చేసుకున్న ఆయన.. మార్చి 23 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనుండటం విశేషం.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అయితే తన తొలి సినిమా కోసం ఎన్టీఆర్ తో సెట్స్ మీదకు రావడం పట్ల ఎంతో ఆతృతగా ఉందని జాన్వీ చెప్పడం మరో విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటై ఉన్నారు ఎన్టీఆర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Koratala siva, NTR30, Tollywood