AMAZON PRIME VIDEO 8 NEW VIDEO CHANNELS ON AMAZON PRIME MORE ENTERTAINMENT NOW SR GH
Amazon Prime Video : అమెజాన్ ప్రైమ్‌లో 8 కొత్త వీడియో ఛానల్స్.. ఇప్పుడు మరింత వినోదం..
Amazon Prime Video Photo : Twitter
Amazon Prime Video : ప్రైమ్ మెంబర్స్ కోసం 8 సరికొత్త వీడియో ఛానల్స్ లాంచ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. దీంతో అమెజాన్ ఇప్పుడు మరింత వినోదం అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
అమెజాన్.. భారత్‌లో అతిపెద్ద ఓటీటీ డిస్ట్రిబ్యూటర్ అనే సంగతి తెలిసిందే. ప్రైమ్ వీడియోతో (Amazon Prime Video) స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది. తాజాగా ప్రైమ్ మెంబర్స్ కోసం 8 సరికొత్త వీడియో ఛానల్స్ లాంచ్ చేసింది అమెజాన్. వీటిలో వీడియో కంటెంట్ ప్రసారం చేయనుంది. దీంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలను ప్రైమ్ నుంచే వీక్షించే అవకాశం లభిస్తుంది. లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యూబే, ఈరోస్ నౌ, మూబీ, షార్ట్స్ టీవీ, హోయ్ చోయ్, మనోరమ మ్యాక్స్ (Discovery+), (Lionsgate Play) (Docubay), (Eros Now), (MUBI), (Hoichoi), (Manorama Max) అనే 8 ఛానల్స్‌ను అమెజాన్ తమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో ప్రారంభించింది. ఇవి యాడ్ ఆన్ సేవలుగా అందుబాటులోకి రానున్నాయి..
ఓటీటీ పరిధిలోని ఈ ఛానళ్లకు.. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులందరికీ యాక్సెస్ ఉంటుంది. వివిధ వీడియో స్ట్రీమర్లను ఒకే వేదికపై తీసుకొచ్చి పేమెంట్స్ నిర్వహించే సౌలభ్యాన్ని అమెజాన్ కల్పించింది. అంటే ఈ ఛానల్స్ అన్నీ ఒకే ప్లాట్ ఫాంలో ఉంటాయి. పేమెంట్ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఈ విషయంపై ప్రైమ్ వీడియో కంట్రీ మేనేజర్(ఇండియా) గౌరవ్ గాంధీ స్పందించారు.
"ప్రైమ్ వీడియోలోనే కస్టమర్లకు అనేక ఎంటర్టైన్మెంట్ సేవలను అందించే స్పేస్‌ను రూపొందించాం. వినియోగదారులు తమ ప్రైమ్ మెంబర్షిప్ లాగిన్ ద్వారా వీటికి యాక్సెస్ పొందవచ్చు. 11 దేశాల్లో ఈ వీడియో ఛానళ్లను పరీక్షించాం. ప్రస్తుతం భారత్‌లో సరికొత్త మార్కెట్‌గా ప్రైమ్ వీడియో మారింది. అమెజాన్‌కు మొత్తం 350 ఓటీటీ భాగస్వామున్నారు. అయితే ప్రస్తుతానికి భారత్‌లో కేవలం ఎనిమిదింటిని మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చాం" అని గౌరవ్ గాంధీ అన్నారు.
ఈ వీడియో ఛానళ్ల ధరలు ప్లాట్‌ఫాంను బట్టి మారుతుంటాయి. సంవత్సరానికి రూ.299 నుంచి రూ.1999(MUBI) వరకు ఉంటాయి. అమెజాన్ తన భాగస్వాములు ప్రైమ్ వీడియో ఛానళ్లకు సబ్ స్క్రైబ్ చేసేవారిని ఆఫర్లను(introductory offers) కూడా ప్రకటిస్తోంది.
* మూడు రెట్లు వృద్ధి..
అమెజాన్ ప్రైమ్ వీడియో రెండేళ్లలో మూడు రెట్లు వృద్ధిని సాధించిందని గౌరవ్ గాంధీ తెలిపారు. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో టీవీ చూసే వారు ఎంతమంది ఉంటారో అంతకు సమానంగా ప్రైమ్ మెంబర్లు (Amazon Prime Video) అవుతారని చెప్పారు. పాతళ్ లోక్, మీర్జాపుర్, ముంబయి డైరీస్ లాంటి వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రాంతీయ కంటెంట్‌కు తాము ప్రాధాన్యమిస్తున్నామని, దీంతోపాటు బయటి కంటెంట్‌ను కూడా ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.