Home /News /movies /

AMAZON PRIME GIVES THIS BUMPER OFFER TO POWER STAR PUNEETH RAJKUMAR FANS FOR HIS TRIBUTE SRD

Puneeth Rajkumar: పునీత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్..

Puneeth Rajkumar

Puneeth Rajkumar

Puneeth Rajkumar: కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ అప్పుకు తనదైన రీతిలో నివాళి ఇచ్చేందుకు సిద్ధమైంది.

    కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ (Puneeth Rajkumar)​.. గతేడాది అక్టోబరు 19న గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఆయన తనువు చాలించడాన్ని అభిమానుల్ని తట్టుకోలేకపోయారు. కొన్నిరోజులపాటు ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయారు. సాధారణ ప్రజలతో పాటు స్టార్ సెలబ్రిటీల వరకు పునీత్​కు ఘనంగా నివాళి అర్పించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా చేరిపోయింది. పునీత్​కు.. అమెజాన్ ప్రైమ్​ (Amazon Prime) కూడా తనదైన రీతిలో నివాళి ఇచ్చేందుకు సిద్ధమైంది. పునీత్ నటించిన​ 5 చిత్రాలను( లా, ఫ్రెంచ్ బిర్యానీ, కావలుదారి, మాయాబజార్ & యువరత్న) ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఫ్యాన్స్, యాప్​లో ఫ్రీగా చూసే ఛాన్స్ కల్పించింది. ప్రైమ్ సభ్యులు కాని వారు కూడా ఉచితంగా ఈ సినిమాలు చూడవచ్చు. అలానే పునీత్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోన్న మూడు కొత్త సినిమాలు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్​’ కూడా తమ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రకటన చేసింది.

    రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లో నటించడమే కాదు. పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టం.

    బాలనటుడిగానే సినిమాల్లో నటించడం ప్రారంభించిన పునీత్.. 2002లో ‘అప్పు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి అతడని ఫ్యాన్స్ ‘అప్పు’ అని పిలవడం ప్రారంభించారు.



    అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుదుగురు, అంజనీపుత్ర తదితర సినిమాలతో హిట్లు కొట్టి స్టార్ హీరోగా రాణించారు పునీత్. మొత్తం 32 సినిమాల్లో నటించారు. గతేడాది ఏప్రిల్​లో విడుదలైన ‘యువరత్న’ మూవీలో చివరగా కనిపించారు. ఈ మూవీ తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించింది.

    సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ. తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు.

    ఇది కూాడా చదవండి :  మన దేశం తరుపున ఆస్కార్ బరిలో సూర్య ‘జై భీమ్’.. మోహన్‌లాల్ ‘మరక్కార్’..

    కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్‌కు మంచి డిమాండ్‌ ఉండేది. తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ అడుగుజాడల్లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. పునీత్ KMF ఉత్పత్తులను ఎలాంటి ఒప్పందం లేకుండా ప్రమోట్ చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Amazon prime, Puneeth RajKumar, Sandalwood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు