ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది.. వెంకటేష్ సినిమా పరిస్థితి...

ప్రస్తుతం సినిమాలకు డిజిట‌ల్‌ మార్కెట్ పెరగడంతో ఆయా సినిమాల రెవెన్యూ, వాటి మార్కెట్ రేంజ్, వ్యువర్ షిప్ కూడా పెరిగింది.

news18-telugu
Updated: November 9, 2019, 3:24 PM IST
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది.. వెంకటేష్ సినిమా పరిస్థితి...
Instagram/venkateshdaggubati
  • Share this:
ప్రస్తుతం సినిమాలకు డిజిట‌ల్‌ మార్కెట్ పెరగడంతో ఆయా సినిమాల రెవెన్యూ, వాటి మార్కెట్ రేంజ్, వ్యువర్ షిప్ కూడా పెరిగింది. అయితే ఈ విషయంలో తెలుగు నిర్మాత‌లు ఆనంద ప‌డుత‌న్న‌ప్ప‌టికీ మ‌రో కోణంలో వారికి న‌ష్టం కూడా వాటిల్లుతోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే అంటే ఆ సినిమా థియేట‌ర్స్‌లో ఉండ‌గానే డిజిటల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమాకు థియేట‌ర్స్‌కు వచ్చే ప్రేక్ష‌కులు రావ‌డం తగ్గుతోంది. దీంతో నిర్మాత‌ల నుండి హ‌క్కుల‌ను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు న‌ష్టం వాటిల్లుతుంది. అందుకు ఉదాహారణ నానీ గ్యాంగ్ లీడర్ సినిమా. ఆ సినిమా ఓ వైపు కొన్ని థియేటర్స్‌లతో ఆడుతుండగానే.. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సమస్యను పరిష్కించుకోవాడానికి తెలుగు నిర్మాత‌లు ఈ విష‌యంపై స‌మావేశమై సినిమాను డిజిట‌ల్ మాధ్య‌మంలో విడుద‌ల చేయాలంటే కనీసం 8 వారాలు గ్యాప్ ఉండాల‌ని నిర్ణయించారు.

 View this post on Instagram
 

stream now ✊ #ASURAN


A post shared by amazon prime video IN (@primevideoin) on

తాజాగా ఇలాంటిదే మరోసారి జరిగింది. ధనుష్, వెట్రిమారన్ దర్శకత్వంలో ఇటీవల తమిళంలో వచ్చిన 'అసురన్' అక్కడ అఖండ విజయం సాధించింది. దళిత కథ, నేపథ్యంలో త‌మిళంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించారు ప్రముఖ హీరో వెంకటేష్. దీనికి సంబందించి ఓ వార్త కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.  అయితే 'అసుర‌న్' సినిమా విడుద‌లై నెల రోజులైందో లేదో అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.  దీంతో అమెజాన్ ప్రైమ్‌లో అటు తమిళ ప్రేక్షకులు, ఇటూ తెలుగు వారు చూస్తున్నారు. దీంతో తెలుగులో రీమేక్ చేయాలని భావించిన నిర్మాతలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

నాభి అందాలతో కేక పెట్టిస్తోన్న నభా నటేష్..
First published: November 9, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading