నాగార్జునకు ప్రేమలేఖ రాసిన అమల.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లవ్ లెటర్..

అక్కినేని నాగార్జున దంపతులు

నాగార్జున..వయసు 60కి దగ్గర పడ్డ ఇప్పటికీ నవ మన్మథుడులా కుర్ర హీరోలు ఈర్ష్య పడేలా ఉన్నాడు. నాగార్జున సినిమాల్లోకి వచ్చి మే 23 నాటికి 33 ఏళ్లు పూర్తి కావొస్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాగార్జున భార్య అక్కినేని అమల ఆయన అభిమానిగా ఓ ప్రేమ సందేశాన్ని లేఖ రూపంలో ఇచ్చారు.

  • Share this:
    నాగార్జున..వయసు 60కి దగ్గర పడ్డ ఇప్పటికీ నవ మన్మథుడులా కుర్ర హీరోలు ఈర్ష్య పడేలా ఉన్నాడు. నాగార్జున సినిమాల్లోకి వచ్చి మే 23 నాటికి 33 ఏళ్లు పూర్తి కావొస్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాగార్జున భార్య అక్కినేని అమల ఆయన అభిమానిగా ఓ ప్రేమ సందేశాన్ని లేఖ రూపంలో ఇచ్చారు.మరోవైపు రెండోసారి ప్రధాన మంత్రిగా గెలిచిన నరేంద్ర మోదీకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. అమల రాసిన ఈ లెటర్...సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించావు. నా భర్త, నా హీరో, నా స్నేహితడు నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావు. ఇప్పటికీ నా గుండె నీ కళ్లలోని మెరుపు, స్టైల్ చూడటానికి తపిస్తుంది. స్క్రీన్ పై నువ్వు కనపడగానే నా లాంటి అభిమానులు చూపులు తిప్పుకోలేము. కాలం గడుస్తున్న కొద్దీ నువ్వు మరింత అందంగా తయారవుతున్నావు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెబుతూ మాకు ఎంగ్జాపుల్‌గా నిలుస్తున్నావు. నీ ప్రతీ సినిమా సమయంలో ఎలా స్క్రీన్ పై కనిపిస్తావోనని ఎంతో ఎగ్జైంటింగ్‌గా ఎదురు చూస్తుంటా. ఎవరు చేయని వివిధ కథాంశాలతో మెప్పించావు.     నీ సినిమాలతో నాకు వేంకటేశ్వర స్వామి, రాముడు, శిరిడి సాయిని నన్ను పరిచయం చేశావు. ఆ దేవుళ్లు ఇపుడు మన ఫ్యామిలీలో ఇపుడు మన కుటుంబంలో భాగం అయ్యారు. ఓడిపోతానని నువ్వు భయపడలేదు మంచి స్టోరీలను మా లాంటి అభిమానులకు అందించావు. అలాగే కొత్త టాలెంట్ ఎక్కడుంటే వాళ్లను ప్రోత్సహించావు. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగేశ్వర్ రావులా  సినీ ఇండస్ట్రీలో నువ్వు ఇంకా ఎన్నో ఏళ్లు సినీ ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ అమల నాగార్జునకు ప్రేమ లేఖ రాసి..తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.


    First published: