Amala Akkineni: అభిజీత్ ఎలాంటి వాడో తెలుసా.. అమల అక్కినేని అసలు నిజాలు..

Amala Akkineni: ఒకప్పుడు అభిజీత్ అంటే.. అప్పుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించాడు కదా.. ఆ తర్వాత పెళ్ళిగోల అనే వెబ్ సిరీస్ చేసాడు.. అని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి వచ్చేది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 18, 2020, 6:05 PM IST
Amala Akkineni: అభిజీత్ ఎలాంటి వాడో తెలుసా.. అమల అక్కినేని అసలు నిజాలు..
అమల అక్కినేని అభిజీత్ (abijeet amala akkineni)
  • Share this:
ఒకప్పుడు అభిజీత్ అంటే.. అప్పుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించాడు కదా.. ఆ తర్వాత పెళ్ళిగోల అనే వెబ్ సిరీస్ చేసాడు.. అని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఇంటికి అభిజీత్ పరిచయం అయిపోయాడు. దానికి కారణం బిగ్ బాస్.. సీజన్ 4లో ఈయన పేరు మార్మోగిపోతుంది. ఓట్ల పరంగా చూసుకున్నా కూడా అందరికంటే ముందున్నాడు అభిజీత్. ఈ షో నుంచి మంచి పేరు సంపాదించుకుంటున్నాడు అభి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అక్కినేని అమల. ఈమెకు అతడెలా తెలుసు అనుకోవచ్చు.. ఈ ఇద్దరూ కలిసి నటించారు. అప్పట్లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమ్మ పాత్రలో నటించింది అమల అక్కినేని. అందులో ఆమె కొడుకుగా నటించాడు అభి. ఈ ఇద్దరూ కలిసి దాదాపు నెల రోజులు పని చేసారు. దాంతో అప్పుడు నిజంగానే చాలా క్లోజ్ అయిపోయారు అభి, అమల అక్కినేని.
amala akkineni,amala akkineni twitter,amala akkineni abijeet,amala akkineni bigg boss abijeet,amala akkineni life is beautiful movie,amala akkineni abijeet life is beautiful movie,అభిజీత్,అమల అక్కినేని,బిగ్ బాస్ 4 తెలుగు అభిజీత్ అమల అక్కినేని
అమల అక్కినేని అభిజీత్ (abijeet amala akkineni)


లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నపుడే అభి గురించి చాలా బాగా చెప్పింది అమల. తను నిజంగానే తన కొడుకు లాంటి వాడు అని చెప్పుకొచ్చింది అమల. ఇప్పుడు కూడా ఇదే అంటుంది ఈ సీనియర్ హీరోయిన్. అభిజీత్ నిజంగా చాలా మంచి కుర్రాడు అని చెప్పింది అమల. అంతేకాదు పెద్దలతో చాలా మర్యాదగా ఉంటాడని.. ఆ కుర్రాడు నిజంగా తన కొడుకు లాంటి వాడే చెప్పింది. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా తనను నిజంగా అమ్మలాగే చూసుకున్నాడని చెప్పింది.
amala akkineni,amala akkineni twitter,amala akkineni abijeet,amala akkineni bigg boss abijeet,amala akkineni life is beautiful movie,amala akkineni abijeet life is beautiful movie,అభిజీత్,అమల అక్కినేని,బిగ్ బాస్ 4 తెలుగు అభిజీత్ అమల అక్కినేని
అభిజీత్ (Abijeet/Twitter)

తన మాదిరే అభిజీత్‌కు కూడా మూగ జీవాలంటే చాలా యిష్టమని.. అలా తనకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యాడని చెప్పింది అమల. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా చేస్తున్న సమయంలో అభి చిన్న కుర్రాడని.. అప్పుడే బీ టెక్ పూర్తి చేసుకుని వచ్చాడని తెలిపింది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాడని ప్రశంసించింది. ఈమె నుంచి కూడా సర్టిఫికేట్ రావడంతో అభిజీత్‌కు మరింత క్రేజ్ పెరిగిపోతుంది. కచ్చితంగా ఈ సారి విన్నర్ అయ్యేది అభిజీత్ అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: November 18, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading