#MeToo:అలోక్‌‌నాథ్ పరువునష్టం దావా... నష్టపరిహారంగా రూ.1 డిమాండ్

లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పడంతో పాటు ఒక్క రూపాయి నష్టపరిహారంగా చెల్లించాలని కోరిన సీనియర్ నటుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 15, 2018, 5:50 PM IST
#MeToo:అలోక్‌‌నాథ్ పరువునష్టం దావా... నష్టపరిహారంగా రూ.1 డిమాండ్
లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పడంతో పాటు ఒక్క రూపాయి నష్టపరిహారంగా చెల్లించాలని కోరిన సీనియర్ నటుడు...
  • Share this:
మాజీ హాట్ హీరోయిన్ తనుశ్రీదత్తా, బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ మీద చేసిన ఆరోపణలతో సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ‘మీటూ’ హ్యాష్‌ట్యాగ్‌తో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. సీనియర్ రచయిత, నిర్మాత వింతా నంద... సీరియల్ నటుడు అలోక్‌నాథ్‌ మీద చేసిన రేప్ ఆరోపణలు బాలీవుడ్‌లో పెను భూకంపమే సృష్టించాయి. ‘బాలీవుడ్ గుమ్మడి’గా, మంచి వినయవిధేయతలు కలిగిన పెద్దమనిషిగా ఇన్నాళ్లు చెలామణీ అవుతూ వచ్చిన అలోక్‌నాథ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ షాక్‌కు గురయ్యింది.

తనపైన వచ్చిన రేప్ ఆరోపణల గురించి, స్పందించిన అలోక్‌నాథ్... ‘ఈ ఆరోపణలను నేను ఖండించడం లేదు... అలాగని ఒప్పుకోవడం లేదు...రేప్ జరిగే ఉండొచ్చు అయితే వేరే ఎవరో చేసిన పనిని నాపై వేస్తున్నారని...’ సమాధానమిచ్చారు. ‘తాగిన మత్తులో ఉన్న ఆమెపై ఎవరో రేప్ చేసినా... అదే నేనే చేశానని ఆమె అనుకుంటోంది...’ అంటూ సింపుల్‌గా కొట్టేసిన అలోక్‌నాథ్... తాజాగా తనపై ఆరోపణలు చేసిన వినితా నందాపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

అయితే సీనియర్ సీరియల్ నిర్మాత అయిన వినితా నందాపై ఆయన పరువు నష్టపరిహారంగా రూపాయి చెల్లించాలంటూ దావా వేయడం చర్చనీయాంశమైంది. వినితానందపై కేసు వేసిన అలోక్‌నాథ్... తనకు బహిరంగంగా లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పడంతో పాటు ఒక్క రూపాయి నష్టపరిహారంగా చెల్లించాలని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. వినితా నందాతో పాటు నటి సంధ్యా మిధ్రుల్ కూడా ‘అలోక్‌నాథ్ తనను లైంగికంగా వేధించాడంటూ’ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

90ల్లో ‘తారా’ సిరీయల్ ద్వారా ఫేమ్‌లోకి వచ్చిన నిర్మాత వినితా నంద, 19 ఏళ్ల క్రితం తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ చేసింది. ‘తన భార్య నాకు బెస్ట్ ఫ్రెండ్. మా ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వస్తుండేవాళ్లం. అతను పెద్ద తాగుబోతు, సిగ్గులేని వ్యక్తి, నీచుడు... కాని అప్పట్లోనే టెలివిజన్ సూపర్ స్టార్‌గా వెలుగొందారు. నా సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్న నటిని ఆయన లైంగికంగా వేధించాడు. సెట్స్‌లోనే ఆమెతో నీచంగా ప్రవర్తించేవాడు. అయినా అందరూ చూస్తూ సైలెంట్‌గా ఉండేవాళ్లు. పార్టీకని పిలిచి ఫుల్లుగా తాగి ఉన్న నాపై... నా ఇంట్లోనే అఘాయిత్యం చేశాడు...’ అంటూ అలోక్‌నాథ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది వినితానంద.
Published by: Ramu Chinthakindhi
First published: October 15, 2018, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading