Allu Arjun: అల్లు అర్జున్‌ను సవాల్ చేసిన భార్య స్నేహా రెడ్డి..

Allu Arjun Sneha Reddy: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మెగా డాటర్ సుస్మితా కొణిదెల విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 27, 2020, 7:48 PM IST
Allu Arjun: అల్లు అర్జున్‌ను సవాల్ చేసిన భార్య స్నేహా రెడ్డి..
అల్లు అర్జున్ స్నేహా రెడ్డి (allu arjun sneha redy)
  • Share this:
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మెగా డాటర్ సుస్మితా కొణిదెల విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి.. తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటింది. అనంతరం స్నేహా రెడ్డి మాట్లాడుతూ.. ఈ భూమిపైన మనుషులకు ఎంత పాత్ర ఉందో.. ఇతర జీవజాలానికి అంతే పాత్ర ఉందని తెలిపింది. ప్రకృతి బాగున్నపుడే అందరం ఆనందంగా ఉంటామని.. అందుకు మొక్కలు నాటడమే మార్గమని జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారని చెప్పింది స్నేహ.
అల్లు స్నేహా రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Allu Sneha green india challenge)
అల్లు స్నేహా రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Allu Sneha green india challenge)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని.. తెలంగాణ మొత్తం పచ్చని నేలగా మారాలని కోరుకుంటున్నానని తెలిపింది. తన భర్త అల్లు అర్జున్, తన స్నేహితులు జూపల్లి మేఘనా రావు (మైహోమ్స్ కన్ స్ట్రక్షన్ డైరెక్టర్), ఆర్ సింగారెడ్డికి ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరింది.
Published by: Praveen Kumar Vadla
First published: July 27, 2020, 7:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading