భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "ఊర్వశివో రాక్షసివో" ( Urvasivo Rakshasivo). కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుతున్న అల్లు శిరీష్ (Allu Sirish) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ (Anu Emmanuel) హీరోయిన్ గా నటించింది.
నవంబర్ 4న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. నిన్న (ఆదివారం) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేయడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రేక్షకులను మరింత అట్రాక్ట్ చేశారు.
ఒక నిమిషం నలభై సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చూపించారు. ఇన్ని EMIలు ఉన్నవాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా అంటూ అల్లు శిరీష్ తో వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ ఈ వీడియోలో హైలైట్ అయింది. ఇక హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో అల్లు శిరీష్ రొమాంటిక్ మూమెంట్స్ యమ కిక్కిచ్చాయి. సునీల్, పోసాని కృష్ణమురళి కనిపించి చిత్రంలో కామెడీ యాంగిల్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది. సో.. చూడాలి మరి ఈ ఊర్వశివో రాక్షసివో మూవీ అను, అల్లు శిరీష్ కెరీర్‌కి ఏ మేర ప్లస్ అవుతుందనేది!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.