హోమ్ /వార్తలు /సినిమా /

Alli Sirish: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ "ఉర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్

Alli Sirish: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ "ఉర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్

Anu Immanuel Photo News 18

Anu Immanuel Photo News 18

Urvasivo Rakshasivo Teaser: GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "ఉర్వశివో రాక్షసివో". కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "ఉర్వశివో రాక్షసివో" ( Urvasivo Rakshasivo). కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ (Allu Sirish) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ (Anu Emmanuel) హీరోయిన్ గా నటించింది.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా "ఉర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. రిలీజ్ చేసిన ఈ టీజర్ చూస్తుంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు. టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగిపోవడమే గాక అన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతోంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు.

అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన పోస్టర్స్,టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది.

ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Allu sirirsh, Anu emmanuel, Tollywood

ఉత్తమ కథలు