కామెడీతో అదరగొడుతున్న అల్లు శిరీష్ ABCD ట్రైలర్..

'ఏబీసీడీ'..అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి' అనేది ట్యాగ్ లైన్‌. అల్లు శిరీష్‌, రుక్సార్ జంటగా వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: April 15, 2019, 12:12 PM IST
కామెడీతో అదరగొడుతున్న అల్లు శిరీష్ ABCD ట్రైలర్..
ఏబీసీడీ పోస్టర్
news18-telugu
Updated: April 15, 2019, 12:12 PM IST
'ఏబీసీడీ'..అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి' అనే ట్యాగ్ లైన్‌‌తో అల్లు శిరీష్‌, రుక్సార్ జంటగా వస్తున్న మూవీకి సంబంధించిన ట్రైలర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే..అమెరికాలో ఓ పెద్ద కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు.. ఇండియాకు వచ్చి మధ్య తరగతి జీవితాన్ని ఎలా గడిపాడు..అనేది కథలా తెలుస్తోంది. మొదట కామెడీగా సాగిన ట్రైలర్... చివరలో పొలిటికల్ టచ్ ఇవ్వడంతో స్టోరీ ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఇది.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. అక్కడ మలయాళ సూపర్ స్టార్..మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ చేశారు. దుల్కర్..తెలుగులో మహానటి సినిమా చేసింది తెలిసిందే. తెలుగు ఏబీసీడీను సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు, ఈయనకు ఇదే తొలి సినిమా. అల్లు శిరీష్‌తో పాటు.. ఇంకా ఈ సినిమాలో మాస్టర్‌ భరత్, నాగబాబు, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు నటించారు. మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...