అల్లు అరవింద్ గతేడాది తన ముగ్గురు కుమారులకు ఆస్తులు పంచేసాడనే వార్తలు వచ్చాయి. అందులో నిజం కూడా ఉందని చాలా మంది నిర్ధారించారు కూడా. ఇదే క్రమంలోనే ఎవరికి వాళ్లు తమ కెరీర్స్ కూడా సెట్ చేసుకుంటున్నారు అల్లు వారసులు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ నిర్మాతగా సెటిల్ అయ్యాడు.. ఇక అల్లు అర్జున్ ఎలాగూ సూపర్ స్టార్ అయిపోయాడు.. ఇక అల్లు శిరీష్ కూడా తన కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. కుటుంబంతో విడిపోయాడు కూడా. మొన్నటి వరకు కూడా అమ్మానాన్నలతో కలిసి ఉన్న శిరీష్.. ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు.

అల్లు బ్రదర్స్ ఫోటో (allu brothers)
తాను కొత్త అపార్ట్మెంట్లోకి మారిపోయానని అభిమానులతో చేసిన లైవ్ ఛాట్‌లో చెప్పాడు శిరీష్. అంతేకాదు ఈయన పోస్ట్ చేసిన వీడియో చూస్తుంటే కూడా ఒక్కడే ఉన్నాడనే సంగతి అర్థమవుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో అల్లు శిరీష్ ఒంటరిగానే కాలాన్ని గడుపుతున్నాడు. బ్యాచ్‌లర్ కావడంతో పాపం పడరాని పాట్లు పడుతున్నాడు ఈ కుర్ర హీరో. ఈ క్వారంటైన్లో ఎలా గడుపుతున్నాడో వివరిస్తూ వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాడు శిరీష్. మొన్నటి వరకు ఫ్యామిలీతో ఉండే వీడియోలు షేర్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం ఒక్కడే కనిపిస్తున్నాడు.
ఆ మధ్య జనతా కర్ఫ్యూ అప్పుడు కూడా అల్లు ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చిన కరతాళ ధ్వనులు చేసింది. అందులో అల్లు శిరీష్ లేడు.. మరోసారి దీపాలు వెలిగించిన సమయంలోనూ అల్లు శిరీష్ ఒంటరిగానే ఉన్నాడు. తాజాగా అల్లు శిరీష్ షేర్ చేసిన వీడియోను చూస్తే.. ఎన్ని కష్టాలు పడుతున్నాడో అర్థమవుతోంది. అన్నట్లు ఈయన యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా సెటిల్ అవుతాడనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అందులో నిజం లేదు.. త్వరలోనే కొత్త సినిమా అనౌన్స్ చేయాలనుకుంటున్నాడు శిరీష్. మరోవైపు త్వరలోనే అల్లు అర్జున్ కూడా కొత్త ఇంటికి మారిపోనున్నాడు. ఇప్పటికే ఈయన కొత్త ఇంటికి ముహూర్తం కూడా పెట్టాడు.
Published by:Praveen Kumar Vadla
First published:May 05, 2020, 22:08 IST