HOME »NEWS »MOVIE »allu shirish mega entry into short films and he done city lo sankranti movie with dethadi harika pk

దేత్తడి హారికతో అల్లు శిరీష్.. షార్ట్ ఫిల్మ్స్‌లోకి మెగా ఎంట్రీ..

దేత్తడి హారికతో అల్లు శిరీష్.. షార్ట్ ఫిల్మ్స్‌లోకి మెగా ఎంట్రీ..
దేత్తడి హారిక అల్లు శిరీష్

మెగా బ్రాండ్ ఉండి కూడా ఇప్పటి వరకు సొంత గుర్తింపు తెచ్చుకోలేదు అల్లు శిరీష్. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఈయనకు ఇమేజ్ మాత్రం రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మార్క్ చూపించలేదు.

  • Share this:
మెగా బ్రాండ్ ఉండి కూడా ఇప్పటి వరకు సొంత గుర్తింపు తెచ్చుకోలేదు అల్లు శిరీష్. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఈయనకు ఇమేజ్ మాత్రం రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మార్క్ చూపించలేదు. గతేడాది నటించిన ఏబీసీడీ కూడా డిజాస్టర్ అయిపోయింది. దాంతో అల్లు శిరీష్ ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు. ఈ క్రమంలోనే ఈయన ప్రయోగాలు చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే ఇప్పుడు డిజిటల్ మీడియా వైపు వచ్చాడు. ఈయన షార్ట్ ఫిల్మ్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సిటీలో సంక్రాంతి అంటూ ఓ లఘు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.





సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో దేత్తడి హారిక నటించింది. ఈమెతో కలిసి ఈ షార్ట్ ఫిల్మ్ చేసాడు శిరీష్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. బావ బావ అంటూ శిరీష్‌ను బాగానే ఆట పట్టించింది హారిక. బావతో పాటు సంక్రాంతి జరుపుకోవాలని పల్లెటూరి నుండి పట్నం వచ్చిన మరదలితో సాగే సరదాలతో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. త్వరలోనే విడుదల కానుంది ఈ షార్ట్ ఫిల్మ్. ప్రోమో అయితే బాగానే అలరించింది. మొత్తానికి సినిమాలు అయ్యాయి.. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వైపు కూడా వచ్చేస్తున్నాడు ఈ అల్లు వారబ్బాయి.
Published by:Praveen Kumar Vadla
First published:January 10, 2020, 12:45 IST

टॉप स्टोरीज