
అల్లు శిరీష్ స్టైలిష్ మేకోవర్ (Allu Shirish Makeover)
Allu Shirish makeover: అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడనేది అందరికీ తెలుసు. అప్పట్లో కొందరు బన్నీ లుక్స్‌పై క్రిటిసైజ్ కూడా చేసారు. అయితే అదే అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అయిపోయాడు. గత 18 ఏళ్లలో బన్నీ కంటే బాగా..
అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడనేది అందరికీ తెలుసు. అప్పట్లో కొందరు బన్నీ లుక్స్‌పై క్రిటిసైజ్ కూడా చేసారు. అయితే అదే అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అయిపోయాడు. గత 18 ఏళ్లలో బన్నీ కంటే బాగా తెలుగు ఇండస్ట్రీలో తనను తాను మేకోవర్ చేసుకున్న హీరో ఎవరూ లేరేమో..? ఇప్పుడు అల్లు శిరీష్ కూడా అన్నయ్య దారిలోనే వెళ్తున్నాడు. గౌరవం సినిమాతో ఈయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కమర్షియల్ కంటే కూడా కంటెంట్ వైపు పరుగులు తీస్తున్నాడు శిరీష్. అందుకే ఈయన కెరీర్లో శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి సినిమాలున్నాయి. ఏబిసిడి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్.. ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. దీనికోసం పూర్తిగా తానను తాను మేకోవర్ చేసుకున్నాడు ఈ అల్లు వారబ్బాయి. ఇప్పుడు శిరీష్‌ను చూస్తుంటే వారెవ్వా అనాల్సిందే. అంతగా మారిపోయాడు ఈయన. ముఖ్యంగా మొన్న నిహారిక పెళ్లిలో కూడా చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు శిరీష్. నిజానికి అప్పుడే సాయి ధరమ్ తేజ్, శిరీష్ మధ్య పెళ్లి టాపిక్ నడిచింది. ఆ తర్వాత అది సోషల్ మీడియలో రచ్చ కూడా అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శిరీష్ మాత్రం కొత్తగా కనిపిస్తున్నాడు. ఈయన నటిస్తున్న సినిమా షూట్ కూడా దాదాపు 35 రోజులు పూర్తైపోయింది. త్వరలోనే సినిమాపై పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
ఈ లోపు తన లుక్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాడు శిరీష్. ఇప్పుడు కూడా బ్లాక్ డ్రస్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు శిరీష్. ఈ ఫోటోలకు నెటిజన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:January 16, 2021, 18:17 IST