రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటుడు విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించాడు అల్లు శిరీష్. ఈయన తన నివాసంలో మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక మంచి కార్యక్రమం చేపట్టారని చెప్పాడు. అందులో తాను కూడా పాల్గొని తన ఇంట్లోనే మొక్కలు నాటడం జరిగిందని తెలిపాడు శిరీష్. మొక్కలు నాటడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పాడు అల్లు వారబ్బాయి.

అల్లు శిరీష్ (allu shirish)
రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు ఈ హీరో. ఈ సందర్భంగా తన మేనల్లుడు ఆరణవ్, మరదలు అన్విత, సమరా నివ్రితిలకు మొక్కలు నాటాలని చాలెంజ్ విసిరాడు శిరీష్.
Published by:Praveen Kumar Vadla
First published:July 04, 2020, 15:00 IST