మూవీ రివ్యూ: "ABCD".. పాపం అల్లు శిరీష్.. మ‌ళ్ళీ నిరాశే..

గౌర‌వం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ అంటూ తంటాలు ప‌డుతున్న హీరో అల్లు శిరీష్. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో ప‌ర్లేద‌నిపించిన ఈ హీరో బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏబిసిడి అంటూ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు శిరీష్. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 17, 2019, 12:52 PM IST
మూవీ రివ్యూ:
ABCD పోస్టర్
  • Share this:
రేటింగ్: 2/5
న‌టీన‌టులు: అల్లు శిరీష్, రుక్స‌ర్ మీర్, భ‌ర‌త్, కోట శ్రీనివాస రావు, రాజా త‌దిత‌రులు

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: స‌ంజీవ్ రెడ్డి
నిర్మాత‌: య‌శ్ రంగినేని
విడుద‌ల‌: సురేష్ ప్రొడక్ష‌న్స్

గౌర‌వం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ అంటూ తంటాలు ప‌డుతున్న హీరో అల్లు శిరీష్. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో ప‌ర్లేద‌నిపించిన ఈ హీరో బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏబిసిడి అంటూ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు శిరీష్. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

క‌థ‌:అర‌వింద్(అల్లు శిరీష్) అమెరికాలోనే పుట్టి పెరిగిన ఓ మిలీనియ‌ర్(నాగ‌బాబు) కొడుకు. డ‌బ్బులోనే పుట్టి డ‌బ్బులోనే పెరిగి విలాసాల‌కు అల‌వాటు ప‌డిపోతాడు. అర‌వింద్ కృష్ణ‌కు తోడుగా బాషా(భ‌ర‌త్) కూడా ఉంటాడు. దాంతో వీళ్ల‌కు డ‌బ్బు విలువ తెలియాల‌ని.. జీవితం విలువ తెలుసుకోవాల‌ని ఇండియాకు ప్లాన్ చేసి పంపిస్తాడు అర‌వింద్ తండ్రి. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత నెల‌కు కేవ‌లం 5 వేల‌తో బ‌త‌కాల‌ని కండీష‌న్ పెడ‌తాడు. అప్పుడు అర‌వింద్, బాషా ఇక్క‌డ ఎలా అడ్జ‌స్ట్ అయ్యారు.. వాళ్ల మ‌ధ్య‌లోకి పొలిటీషియ‌న్ భార్గ‌వ‌(రాజా) ఎలా వ‌చ్చాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

కొంద‌రు హీరోల సినిమాల్లో ఏదో తెలియ‌ని వెలితి ఎప్పుడూ క‌నిపిస్తుంటుంది.. అలాంటి వాళ్ల‌లో పాపం ఎప్పుడూ అల్లు శిరీష్ ముందు క‌నిపిస్తుంటాడు. ఎంచుకునే క‌థ‌ల్లో వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఈ హీరో. కానీ అది తెర‌పైకి వ‌చ్చేస‌రికి మాత్రం మ‌రోలా ఉంటుంది. గౌర‌వం, ఒక్క క్ష‌ణం లాంటి డిఫెరెంట్ కాన్సెప్టుల మాదిరే.. ఇప్పుడు ఏబిసిడి కూడా కొత్త‌గా ప్ర‌య‌త్నించాల‌ని చూసాడు అల్లు శిరీష్. కానీ ఏం చేస్తాం.. ఎప్ప‌ట్లాగే తెర‌పైకి వ‌చ్చేస‌రికి త‌ల‌తోక లేకుండా పోయింది. అమెరిక‌న్ బేస్డ్ క‌న్ఫ్యూజ్డ్ దేశీ అని టైటిల్ కు త‌గ్గ‌ట్లే క‌ల‌గాపుల‌గం అయిపోయింది. ఫ‌స్టాఫ్ అంతా హీరో అమెరికా నుంచి రావ‌డం.. ఇక్క‌డ క‌ష్టాలకు అల‌వాటు ప‌డ‌టంతోనే స‌రిపోయింది. వాటితోనే ప్రేక్ష‌కుల‌కు కూడా అక్క‌డ‌క్క‌డా ఈ క‌ష్టాలు త‌ప్ప‌వేమో..? అలాగే అల‌వాటు అయిపోతారు కూడా. మ‌ధ్య‌లో కొన్ని సీన్లు ప‌ర్లేద‌నిపించినా.. అస‌లు క‌థ ప‌క్క‌న‌బెట్టి సాగేలా తెర‌కెక్కించ‌డంతో అస‌లుకే మోసం వ‌చ్చేసింది. సెకండాఫ్ అస‌లు క‌థ‌లోకి వెళ్లినా.. ఎక్క‌డ్నుంచి ఎక్క‌డికి వెళ్తుందో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్.

మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్ మాయో ఏమో కానీ బాగానే అనిపించిన ఏబిసిడీ.. తెలుగులోకి వ‌చ్చేస‌రికి ఒరిజిన‌ల్ మ‌త్తు మొత్తం దించేసేలా క‌నిపించింది. గ‌త సినిమాల్లో సొంత న‌ట‌న చూపించిన అల్లు శిరీష్.. ఈ సారి మాత్రం కాస్త మోతాదు మించాడేమో అనిపించింది. మ‌రీ ముఖ్యంగా కొన్ని స‌న్నివేశాల్లో కావాల‌నే ఆయ‌న చిరంజీవితో పాటు ప‌వ‌న్, బ‌న్నీల‌ను కూడా అనుక‌రించాడు. అమెరికా నుంచి వ‌చ్చి ఇక్క‌డ త‌న స్వార్థం కోసం అన్నీ చేస్తున్న ఓ యువ‌కుడు.. అనుకోకుండా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో ఎలా క‌లిసిపోయాడు.. వాళ్ల స‌మ‌స్య‌లు ఎలా ప‌రిష్క‌రించాడు అనేది ఏబిసిడి క‌థ‌. మ‌ల‌యాళంలో కావాల్సినంత ఎంట‌ర్టైనింగ్ త‌ర‌హాలో ఈ క‌థ‌ను చెప్పాడు అక్క‌డి ద‌ర్శ‌కుడు. కానీ తెలుగులో మాత్రం అది వ‌ర్క‌వుట్ కాలేదు. దానికితోడు శిరీష్ కూడా క్రౌడ్ పుల్లింగ్ హీరో కాక‌పోవ‌డంతో ఇక్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువే..

న‌టీన‌టులు:
అల్లు శిరీష్ న‌టుడిగా గ‌త సినిమాల్లో సొంత గుర్తింపు కోసం చూసాడు. కానీ ఏబిసిడీలో మాత్రం ఎందుకో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, బ‌న్నీ క‌నిపించారు. వాళ్ల‌ను కావాల‌నే ఇమిటేట్ చేసిన‌ట్లు అనిపించింది. ఇక హీరో స్నేహితుడి పాత్ర‌లో భ‌ర‌త్ బాగానే న‌టించాడు. బాల‌న‌టుడు క‌దా.. స్క్రీన్ పై బాగానే మాయ చేసాడు. కాక‌పోతే కామెడీ కారెక్ట‌ర్ మాత్రం కాదు. హీరోయిన్ రుక్స‌ర్ ఓకే. పొలిటీషియ‌న్ భార్గ‌వ పాత్ర‌లో రాజా బాగా న‌టించాడు. అత‌డి పాత్రే సినిమాకు ప్రాణం. హీరో తండ్రిగా నాగ‌బాబు.. పార్టీ పెద్ద‌గా కోట‌.. న్యూస్ రీడ‌ర్ పాత్ర‌లో వెన్నెల కిషోర్ బాగానే న‌టించారు.

టెక్నిక‌ల్ టీం:
జుడా సాండీ సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. మెల్ల మెల్ల‌గా సాంగ్ ఒక్క‌టే బాగుంది. నేప‌థ్య సంగీతం కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. అమెరికాలో తెర‌కెక్కించిన సీన్స్ క‌ల‌ర్ ఫుల్ అనిపిస్తాయి. ఎడిటింగ్ వీక్. ఇక ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మ‌ల‌యాళంలో హిట్టైన సినిమాను తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లు మార్చ‌డంలో విఫ‌లం అయ్యాడు. అక్క‌డ వ‌ర్క‌వుట్ అయిన సీన్స్ ఇక్క‌డ తేలిపోయాయి. ముఖ్యంగా పొలిటిక‌ల్ చుట్టూ అల్లుకున్న సీన్స్ ఒరిజిన‌ల్ సినిమాలో అద్భుతంగా పేలాయి. కానీ ఇక్క‌డ అవే మైన‌స్ అయిపోయాయి. మొత్తంగా ఏబిసిడీ క‌న్ఫ్యూజ్డ్ డ్రామా అయిపోయింది.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
ABCD.. ఎటూ కానీ క‌న్ఫ్యూజ‌న్ డ్రామా..
First published: May 17, 2019, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading