HOME »NEWS »MOVIE »allu family celebrated shirish birthday together and sneha reddy bake the cake pk

అల్లు వారబ్బాయి బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోయాయిగా..

అల్లు వారబ్బాయి బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోయాయిగా..
శిరీష్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన అల్లు కుటుంబం (allu shirish birthday)

Allu Shirish: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ 2020, మే 30వ తేదీతో 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబం అంతా కలిసింది.

  • Share this:
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ 2020, మే 30వ తేదీతో 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబం అంతా కలిసింది. అందరూ కలిసి శిరీష్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి అల్లు బాబీ, అల్లు అర్జున్ దంపతులు కూడా హాజరయ్యారు. పిల్లలు, మనవళ్లతో కలిసి శిరీష్ పుట్టిన రోజును తన ఇంట్లోనే సెలబ్రేట్ చేసాడు అల్లు అరవింద్. మరిది కోసం ప్రత్యేకంగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇంట్లోనే కేక్ తయారు చేసింది. ఇక కుటుంబ సభ్యులందరి సమక్షంలో కేక్ కట్ చేశాడు శిరీష్‌.

లాక్‌డౌన్ సమయంలో కూడా తన కుటుంబం అంతా కలిసి ఇలా పుట్టిన రోజు సెలబ్రేట్ చేయడం మరిచిపోలేనని.. అద్భుతంగా అనిపించిందని చెప్పాడు శిరీష్. ఇదే విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఈయన. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వాళ్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈయన కొత్త సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. అందుకే లుక్ కూడా మార్చేసాడు శిరీష్. గతేడాది ఏబీసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
Published by:Praveen Kumar Vadla
First published:May 30, 2020, 16:05 IST