పూజా హెగ్డే సాక్షిగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ రెండో షెడ్యూల్ ప్రారంభం..

లాస్ట్ ఇయర్  ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విపలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైన ఈ సినిమా..తాజాగా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే జాయిన్ అయింది.

news18-telugu
Updated: June 5, 2019, 3:36 PM IST
పూజా హెగ్డే సాక్షిగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ రెండో షెడ్యూల్ ప్రారంభం..
అల్లు అర్జున్, త్రివిక్రమ్
  • Share this:
లాస్ట్ ఇయర్  ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విపలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించాడు. ఈ సారి కొడితే బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉండాలని కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. లేటైనా సరే త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పాడు.జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటికే సైలెంట్‌గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైన ఈ సినిమా తాజాగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు.ఈ షెడ్యూల్ నుంచి పూజా హెగ్డే షూటింగ్‌లో జాయిన్ అయింది.ఈ విషయాన్ని స్వయంగా పూజా హెగ్డే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


ఇక హీరో, హీరోయిన్లుగా అల్లు అరవింద్, పూజా హెగ్డే కాంబోలో రెండో మూవీ ఇది. మరోవైపు త్రివిక్రమ్, పూజా కలయికలో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం.
First published: June 5, 2019, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading