హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun - Pushpa Movie: షాకింగ్... ‘పుష్ప’ షూటింగ్ ఆగిందా?

Allu Arjun - Pushpa Movie: షాకింగ్... ‘పుష్ప’ షూటింగ్ ఆగిందా?

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ (Twitter/Photo)

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ (Twitter/Photo)

Alluarjun-Sukumar: స్టైలిష్‌స్టార్ అల్లుు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ రీసెంట్‌గానే షూటింగ్‌ను ప్రారంభించుకుంది. కానీ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి....

  బన్నీ అభిమానులకు నిరాశ తప్పదా? అంటే అవుననే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుంకటే ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్ సాధించిన తమ హీరో .. ‘పుష్ప’ ప్యాన్ ఇండియా హీరోగా అవుతాడని ఫ్యాన్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ దానికి ఇంకా పట్టేలాగానే కనిపిస్తోంది. వివరాల్లోకెళ్తే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. ఎప్పుడో షూటింగ్ ప్రారంభించుకోవాల్సిన ఈ సినిమా కోవిడ్ దెబ్బ‌కు ఆగింది. ఇప్పుడిప్పుడే మ‌న స్టార్స్ అంద‌రూ నెమ్మ‌దిగా వారి సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. దీంతో ‘పుష్ప’ ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరో అల్లు అర్జున్ రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడు మిల్లిలో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. రీసెంట్‌గానే ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. కోవిడ్ స‌మ‌యంలో నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండానే ‘పుష్ప’ టీమ్ షూటింగ్‌స్టార్ట్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో యూనిట్‌లో ఓ స‌భ్యుడిగా ప్రాణం మీద‌కు రావ‌డంతో షూటింగ్‌ను ఆపేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

  నిజానికి ఈషెడ్యూల్‌ను ముందుగా సుక్కు కేర‌ళ‌లో ప్లాన్ చేసుకున్నాడు. అయితే క‌రోనా కార‌ణంగా షెడ్యూల్‌ను మారేడుమిల్లి అట‌వీ ప్రాంతంలో చిత్రీక‌రించాల్సి వ‌స్తుంది. స‌రే! ఎలాగూ ఆల‌స్య‌మైంది కదా.. ఇప్పుడైనా స‌జావుగా సాగుతుంద‌ని అనుకుంటే ఇప్పుడు కూడా అవాంత‌రం కార‌ణంగా షూటింగ్‌ను ఆపేశారంటున్నారు. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. సినిమాపై మంచి అంచాలే ఉన్నాయి. అందుకు త‌గిన‌ట్లు భారీ బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సినిమాను నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

  రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ఇందులో బ‌న్నీ చిత్తూరు జిల్లాకు చెందిన పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్‌గా కనిపించ‌నున్నాడు. పాత్ర డిమాండ్ మేర‌కు బ‌న్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్ క‌నిపిస్తున్నాడు. ఈ ర‌గ్డ్ లుక్‌ను ఈ సినిమా కోస‌మే బ‌న్నీ చాలారోజులుగా మెయిన్‌టెయిన్ చేస్తూ వ‌స్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో బ‌న్నీ ప్యాన్ ఇండియా హీరోగా త‌న రేంజ్‌ను పెంచుకోవాల‌ని కూడా అనుకున్నాడు. మ‌రో వైపు సుకుమార్‌కి కూడా ఇది ప్యాన్ ఇండియా డైరెక్ష‌న‌ల్ డెబ్యూ మూవీనే. అంతే కాదండోయ్... సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోన్న క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందన్న‌కు కూడా ‘పుష్ప‌’ ప్యాన్ ఇండియా మూవీనే. ఇంత మంది ఆశ‌ల‌తో పాటు.. బ‌న్నీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా మాత్రం ఆల‌స్య‌మ‌వుతూనే ఉంది. మ‌రో వైపు బ‌న్నీ త‌దుప‌రి సినిమాను కొర‌టాల శివ‌తో చేయాల్సి ఉంది.

  Published by:Anil
  First published:

  Tags: Allu Arjun, Mythri Movie Makers, Pushpa Movie, Rashmika mandanna, Sukumar