హోమ్ /వార్తలు /సినిమా /

Desamuduru: అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ‘దేశముదురు’ రీ రిలీజ్.. కొత్త ట్రైలర్ విడుదల..

Desamuduru: అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ‘దేశముదురు’ రీ రిలీజ్.. కొత్త ట్రైలర్ విడుదల..

అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమా రీ రిలీజ్ (Twitter/Photo)

అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమా రీ రిలీజ్ (Twitter/Photo)

Desamuduru: అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ‘దేశముదురు’ రీ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేసారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్నారు. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’కు సీక్వెల్‌గా వస్తోంది. ‘పుష్ప’ (Pushpa) సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం రెండు కానుకలు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా దేశముదురు సినిమాతో పాటు పుష్ప 2 సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో  అంతా బ్లాక్ బస్టర్ సినిమాల రీరిలీజ్‌లు అవుతోన్న నేపథ్యంలో అల్లు అర్జున్ దేశముదురు కూడా మరోసారి థియేటర్స్‌లో విడుదల కానుంది. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 6న రెండు రాష్ట్రాల్లో పలు థియేటర్స్‌లో విడుదలకానుంది.  దేశముదురు సినిమాకు చక్రి సంగీతం అందించగా.. హన్సిక హీరోయిన్‌గా నటించింది. ప్రదీప్ రావత్, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి, జీవా, సుబ్బరాజు, తెలంగాణా శకుంతల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమాను 4Kలో ప్రింట్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు దానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

మరోవైపు పుట్టిన సందర్భంగా పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్ పాటు విడుదల తేదిని ప్రకటించనున్నట్టు సమాచారం. పుష్ప2 విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ భారీ సంస్థ నుంచి పుష్ప ది రూల్ మూవీ అన్ని హక్కుల కోసం (అన్ని భాషల రైట్స్‌తో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా) 900 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప ది రూల్ సినిమా 350 కోట్లతో తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్‌లో భారీగా వేసిన సెట్స్‌లో అల్లు అర్జున్ జాయిన్ అవుతాడట. అక్కడే దాదాపు ఓ 30 రోజుల పాటు షూటింగ్ జరుగునుందని టాక్.. ఈ ముప్పై రోజుల్లో దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ కానుందని.. బ్యాంకాక్‌లోని అక్కడి దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారట టీమ్.

అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్‌లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. ఈ ఒక్క సీన్‌ను షూట్ చేసేందుకు టీమ్ థాయ్‌ల్యాండ్ వెళ్లనుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్‌లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ. 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

National Film Awards: అజయ్ దేవ్‌గణ్ సహా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నటులు వీళ్లే..

ఈ సినిమాలో సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుందని తాజా టాక్. ఆమె ఓ 10 నిమిషాల పాత్రలో మెరవనుందట. కథను మలుపుతిప్పే పాత్రలో సాయి పల్లవి నటించనుందని, ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని అన్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు..

First published:

Tags: Allu Arjun, Pushpa 2, Tollywood

ఉత్తమ కథలు