అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే పుష్ప 1 రష్యాలో (Pushpa In Russia) కూడా విడుదలకానుంది. డిసెంబర్లో అక్కడ విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. ఇక ప్రమోషన్లో భాగంగా తాజాగా రష్యన్ భాషా ట్రైలర్ విడుదలైంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 1న మాస్కోలో & డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈక్రమంలో ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సుకుమార్ వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా అక్కడ ఈరోజు అంటే డిసెంబర్ 8న గ్రాండ్‌గా విడుదలైంది. చూడాలి మరి పుష్పకు ఎలాంటీ రెస్పాన్స్ రానుందో.. ప్రస్తుత టాక్ ప్రకారం పుష్ప అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ అందుకుంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక పుష్ప ది రూల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను టీమ్ రెడీ చేసిందని తెలుస్తోంది. తాజాగా జరిగిన షూట్లో పుష్ప2 కు సంబంధంచిన టీజర్‌ను షూట్ చేశారట. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను థాయ్ లాండ్లో కొనసాగించనున్నారని తెలుస్తోంది.
It's time for Pushpa Raj to rule the Russian Box Office ????#PushpaTheRise Grand Russian Language Release Today ????#ThaggedheLe takes over Russia ❤️????#PushpaInRussia Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial @4SeasonsCreati1 pic.twitter.com/zE6pmZnvnr
— Pushpa (@PushpaMovie) December 8, 2022
అక్కడే ఓ 30 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట.
ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్పతో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టనుందో..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Pushpa, Rashmika mandanna