హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun : కూతురు ముందు చిత్తుగా ఓడిపోయిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..

Allu Arjun : కూతురు ముందు చిత్తుగా ఓడిపోయిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..

Allu Arjun with Arha Photo : Twitter

Allu Arjun with Arha Photo : Twitter

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం పుష్ప2కు సంబంధించిన ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక అది అలా ఉంటే కూతురు చేతిలో ఘోరంగా ఓడిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    అల్లు అర్జున్‌కు (Allu Arjun) ఏ మాత్రం స‌మ‌యం దొరికినా, ఆయన పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ గారాల పట్టి కూతురు అర్హ (Allu Arha) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ పిల్లలకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మురిసిపోతుంటారు. ఇక తాజాగా అల్లు అర్జున్ తన కూతురుతో ఆటలాడుతోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అల్లు అర్జున్ కూతురు.. గంగిగోవు పాలు గరిటడైనా చాలు అనే ప‌ద్యాన్ని చెప్పి పొడుపు క‌థ విప్పమని కోరింది. దానికి (Allu Arjun) అల్లు అర్జున్ చెప్పిన స‌మాధానంగా త‌ప్పు అని చెబుతూ ఈసారి టంగ్ ట్విస్టర్ ఇస్తుంది.. నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు తెల్ల లారీలు అనే లైన్‌ను త‌ప్పు లేకుండా వేగం చెప్పాలనీ సవాల్ విసిరింది  (Allu Arha) అర్హ. ఆ ఛాలెంజ్‌లోనూ అల్లు అర్జున్ ఓడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

    ఇక అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు.  ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి.

    అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు రానుందట. పుష్ప2 ఈ నెల 22న హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్‌లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

    ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్పతో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్‌లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టనుందో..

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Allu Arjun, Sukumar, Tollywood news

    ఉత్తమ కథలు