అల్లు అర్జున్ ఓ సినిమాలో దేవుడిగా కనిపించనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వెండితెరపై దేవుడి పాత్రలో నటించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. కొందరు దేవుడి పాత్రలో నటించేందుకు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కడ ప్రేక్షకులతో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో అని భయపడుతుంటారు. సినిమాల్లో దేవుడిగా నటించి మెప్పించిన వారిలో ముఖ్యంగా నందమూరి తారకరామారావు ముందు ఉంటారు. ఈ తరంలో పవన్ కళ్యాణ్, సుమన్, బాలకృష్ణతో పాటు పలువురు స్టార్స్ దేవుడి పాత్రలు చేసి మెప్పించారు. అది అలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. తమిళ సూపర్ హిట్ ప్రేమ కథ 'ఓ మై కడవులే' సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని తెలుస్తోంది. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను చేస్తోన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విలన్’గా ప్రముఖ మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక మందన చేస్తోంది. పుష్ప క్రిస్మస్ సందర్భంగా తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు.ఇది కూడా చూడండి : ధన్య బాలకృష్ణను ఇంత హాటుగా ఎప్పుడూ చూసుండరు..
ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారాడు. విశ్వక్ సేన్ 'అక్టోబర్ 31 - లేడీస్ నైట్' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను 'తలైవి' సినిమా దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం విశ్వక్ పాగల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. రధాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది. హీరోయిన్గా సిమ్రాన్ చౌదరి నటిస్తోంది. ఈ సినిమా అలా ఉండగానే విశ్వక్ సేపన్ హీరోగా 'అశోకవనంలో అర్జునకళ్యాణం' అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా బీవీ ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో భోగవల్లి బాపినీడు, ఇ. సుధీర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చింత విద్యాసాగర్ దర్శకత్వం వహించనున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.