ఒక్క మాట.. ఒకేఒక్క మాట కోసం ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈయన తన నెక్ట్స్ సినిమా గురించి ఎప్పుడెప్పుడు చెప్తాడా అని చూస్తున్నారు వాళ్లు. కానీ వాళ్ల ఆశలను ఎప్పటికప్పుడు నిరాశ పరుస్తూనే ఉన్నాడు ఈయన. ఇప్పుడు అప్పుడు అంటూ ఎప్పుడు చెప్పకుండా తప్పించుకుంటున్నాడు బన్నీ. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు తెలుస్తుంది. స్పెషల్ డే నాడు తన తర్వాత సినిమా గురించి అనౌన్స్ చేయబోతున్నాడు బన్నీ.
ఇప్పటి వరకు ఈయన దర్శకుల లిస్టులో ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈయన చిరు సినిమాతో దృష్టి పెట్టాడు. గీతగోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలోనే బన్నీ నటించబోతున్నాడు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. జనవరి 1న ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందనే ప్రచారం జరుగుతుందిప్పుడు. బన్నీ పిఆర్ టీం ఈ విషయంపై ప్రకటన విడుదల చేయనున్నారు.
‘గీతగోవిందం’ తర్వాత బన్నీ కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈయన చెప్పిన కథ బన్నీకి కూడా నచ్చడంతో త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని తెలుస్తుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ చిత్రం రానుంది. మొత్తానికి ఆర్నెళ్ల గ్యాప్ తర్వాత తన సినిమాపై ఓ తీపికబురు చెప్పడానికి సిద్ధమయ్యాడు బన్నీ.
దిశాపటానీ హాట్ పోటోస్..
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Allu Arjun, Geetha govindam, Telugu Cinema, Tollywood, Trivikram