Allu Sneha Reddy : ప్రియమైనవాడితో అల్లు స్నేహా రెడ్డి.. వైరల్ అవుతోన్న రొమాంటిక్ వీడియో..

Allu Sneha Reddy Photo : Instagram

Allu Sneha Reddy : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అని తెలిసిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్స్‌ను మించిన ఫాలోవర్స్‌తో అక్కడ అదరగొడుతున్నారు. కాగా ఆమె తాజాగా ఓ రొమాంటిక్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి  (Allu Sneha Reddy) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అని తెలిసిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్స్‌ను మించిన ఫాలోవర్స్‌తో అక్కడ అదరగొడుతున్నారు. స్నేహా రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌‌లో 5.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అక్కడ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను.. ఇతర విశేషాలను పంచుకుంటారు. అందులో భాగంగా తన పిల్లలకు సంబంధించిన పిక్స్‌ను వీడియోస్‌ను ఫాలోవర్స్‌తో పంచుకుంటారు. కాగా తాజాగా స్నేహారెడ్డి.. ఓ అదిరిపోయే రొమాంటిక్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో స్నేహా రెడ్డి , అల్లు అర్జున్‌లు అదరగొట్టారు. మాల్దీవ్స్‌లో ఉన్న ఈ జంట అక్కడి అందాలను ఆస్వాాదిస్తూ ఓ వీడియోను పంచుకున్నారు.  చూట్టూ సముద్రం.. మధ్యలో ఓ బోట్‌లో ఉన్నప్పుడు ఓ వీడియోను కెమెరాలో బంధించి స్నేహా రెడ్డి తన ఫాలోవర్స్‌తో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాగర తీరంలో టైటానిక్ రేంజ్‌లో ఉందని, క్యూట్ కపుల్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నాను నెటిజన్స్. ఇక ఇదే వీడియోపై మంచు లక్ష్మి లవ్లీ కపుల్ అంటూ కామెంట్ చేశారు.

    ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది.

    Love Story: కష్టకాలంలో మహేష్ బాబుకు అండగా నిలిచిన నాగ చైతన్య..

    ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.




    ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించారు.

    Balakrishna | Akhanda : అందని ద్రాక్షగా మారిన బాలయ్య అఖండ.. కొత్త రిలీజ్ డేట్ అదేనా..

    ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవ్వడంతో డిసెంబర్‌లో వేణు శ్రీరామ్ ఐకాన్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published: