ALLU ARJUN WIFE ALLU SNEHA REDDY FIRST TIME CHIT CHAT WITH FANS SB
Allu Arjun Favourate food:బన్నీకి ఇష్టమైన ఫుడ్ ఇదే.. సీక్రేట్స్ బయట పెట్టేసిన భార్య
తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ పని కూడా పడుతున్నారు. ఇన్నాళ్లూ హిందీ సినిమా అంటే మనకు సంబంధం లేదు.. దానికి ఖాన్స్‌తో పాటు ఇంకా చాలా మంది హీరోలున్నారు.. మనకెందుకు అని ప్రత్యేకంగా పక్కనే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మన సినిమాలే బాలీవుడ్లో కుమ్మేస్తున్నాయి. మన సినిమాలు అక్కడ రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇప్పుడు తమ సినిమాలతో హిందీలో కూడా చర్చనీయాంశంగా మారారు.
తోలిసారిగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా బన్నీకి సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు స్నేహారెడ్డి సమాధానం చెప్పింది.
ప్రముఖల ఫ్యామిలీ నుంచి వచ్చిన... తన నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఫ్యాన్స్ అంతా ఎంతో ముద్దుగా పిలుచుకొనే బన్నీ స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు. బన్నీ చేసిన సినిమాల గురించి కూడా అందరికీ తెలిసిందే. సినిమా, సినిమాకు కొత్త లుక్‌తో మను పుష్ప రాజ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఇటీవలే పాన్ ఇండియాగా విడుదలైన పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
సెలబ్రిటీలు సైతం పుష్ప డైలాగ్స్, స్టెప్పులతో హల్ చల్ చేశారు. అయితే బన్నీ తన ఫ్యామిలీ విషయంలో కూడా చాలా కేర్ ఫుల్‌గా ఉంటాడు. తనకు ఏ మాత్రం టైం దొరికిన భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతాడు.బన్నీ భార్య స్నేహా రెడ్డి సైతం అల్లు అర్జున్‌కు సంబంధించిన అనేక అంశాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. బన్నీ పిల్లలకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోల్ని కూడా అప్ డేట్ చేస్తుంటుంది.
బన్నీతో పాటు బన్నీ భార్యకు కూడా సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ ఎక్కువే. హీరో భార్యల్లో అల్లు స్నేహారెడ్డి టాప్. ఆమెకు ఉన్న ఇన్ స్టా గ్రాం ఫాలోవర్ల సంఖ్య మిగతా సెలెబ్రిటీల సతీమణులకన్నా ఎక్కువే. రోజురోజుకూ ఆమెకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉంటారు. అయితే తాజాగా అల్లు స్నేహారెడ్డి తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇన్ స్టాగ్రాంలో ఆస్క్ మీ ఎనీ థింగ్ అంటూ పెట్టేసింది. ఇక మొదటి సారిగా అల్లు స్నేహారెడ్డి ఇలా చేయడంతో అభిమానులతో ఆమెను ప్రశ్నలతో ముంచెత్తారు.
అయితే స్నేహారెడ్డి మాత్రం కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పింది. ఇందులో బన్నీకి సంబంధించిన చాలా విషయాలు బయట పెట్టేసింది. బన్నీ సీక్రెట్లను ఫ్యాన్‌కు చెప్పేసింది. బన్నీకి ఇష్టమైన ఫుడ్, ఆమెకు ఇష్టమైన కలర్, ఫోన్లోని లేటెస్ట్ ఫోటోలు ఇలా అన్నీ బయటపెట్టేసింది. బన్నీకి బిర్యానీ అంటే ఇష్టమట, తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, అలాగే ప్రదేశాల్లో లండన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్య సెర్బియాలో సందడి చేసిన ఫోటోలను కూడా స్నేహారెడ్డి చూపించింది.
మరోవైపు అల్లు అర్జున్ బన్నీ నటించిన ‘పుష్ప ది రైజ్’ గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అందులో అల్లు అర్జున్ మేనరిజం, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ సీన్స్, డైలాగ్స్ అన్నీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ‘పుష్ప ది రూల్’ ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు. మారుతున్న బాక్సాఫీస్ సమీకరణాల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్, హీరో అల్లు అర్జున్.. అన్ని ఈక్వేషన్స్‌నీ పరిగణనలోకి తీసుకుని ‘పుష్ప ది రూల్’ తెరకెక్కించాల్సి వుంది. జూలై తర్వాత పుష్ప 2 సినిమాసెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.