Home /News /movies /

ALLU ARJUN VERY EMOTIONAL WORDS ABOUT SUKUMAR THAK YOU MEET ON PUSHPA SUCCESS EVK

Allu Arjun Emotional: కంట‌త‌డి పెట్టిన అల్లు అర్జున్‌.. "పుష్ప" ఈవెంట్‌లో ఎమోష‌న‌ల్‌!

అల్లు అర్జున్ -సుకుమార్,

అల్లు అర్జున్ -సుకుమార్,

Allu Arjun | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి నాలుగు రోజుల వరకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా పుష్ఫ సినిమాకు థాంక్యూమీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అల్లు అర్జున్ బాగా ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఇంకా చదవండి ...
    అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి నాలుగు రోజుల వరకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా పుష్ఫ సినిమాకు థాంక్యూమీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అల్లు అర్జున్ సుకుమార్‌తో త‌న అనుబంధాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. సుకుమార్ లేకుండా నేను లేన‌ని. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే సుకుమార్ ఏ కార‌ణం అని అన్నారు. తాను రుణ‌ప‌డి ఉన్న‌వారిలో త‌ల్లిదండ్రులు, మాతాత‌య్య‌కు, చిరంజీవి గారికి, సుకుమార్‌కు రుణ‌ప‌డి ఉన్నాన‌ని అన్నారు.

    ప‌రుగు సినిమా స‌మ‌యంలో రూ.85ల‌క్ష‌ల స్పోర్ట్స్ కార్ కొన్న స‌మ‌యంలో స్టీరింగ్ ప‌ట్టుకొన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎవ‌రు కార‌ణం అని ఆలోచిస్తే సుకుమార్ కార‌ణం అనిపించ‌ద‌న్నారు. ఈ సంర‌ద్భంగా డార్లింగ్ నువ్వు లేకుంటే నేను లేను అన్నారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ కంట త‌డి పెట్టారు. ప‌బ్లిక్‌లో ఏడ‌వ కూడ‌దు అని అనుకున్నా ఎమోష‌న‌ల్ అయిపోతున్నాని అన్నారు. ఇది సెల‌బ్రెష‌న్ మూడ్‌లోకి వెళ్లాల‌ని అన్నారు. న‌న్ను స్టెలిష్ స్టార్ నుంచి ఇండియా అంతా చూసేలా ఐకానిక్ స్టార్‌ని చేశావంటే నువ్వేకార‌ణం అని అన్నారు.

    Spider Man No Way Home: బాక్స్ ఆఫీస్ వ‌ద్ద స్పైడ‌ర్ మ్యాన్ దూకుడు.. ఇండియాలో క‌లెక్ష‌న్ వివ‌రాలు!


    అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.

    Pawan Kalyan - Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ రివీల్ చేసిన చిత్ర యూనిట్..


    నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. కొన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Allu Arjun, Pushpa, Sukumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు