• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN VERY EMOTIONAL ABOUT AFTER MEETS HIS CHILDREN 14 DAYS OF CORONA QUARANTINE TA

Allu Arjun: క్వారంటైన్ తర్వాత తొలిసారి పిల్లలను కలసుకొని భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్.. వీడియో వైరల్..

Allu Arjun: క్వారంటైన్ తర్వాత తొలిసారి పిల్లలను కలసుకొని భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్.. వీడియో వైరల్..

పిల్లలను చూసి భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్ (Twitter/Photo)

Allu Arjun:  అల్లు అర్జున్‌ రెండు వారాల క్రితం క‌రోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. దీంతో షూటింగ్‌ రద్దు చేసుకుని అప్ప‌టి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ ఆయ‌న చికిత్స తీసుకొని కోలుకున్నారు. క్వారంటైన్ తర్వాత తొలిసారి పిల్లలను కలిసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు.

  • Share this:
    Allu Arjun:  అల్లు అర్జున్‌ రెండు వారాల క్రితం క‌రోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. దీంతో షూటింగ్‌ రద్దు చేసుకుని అప్ప‌టి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ ఆయ‌న చికిత్స తీసుకొని కోలుకున్నారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేసిన అల్లు అర్జున్ త‌న‌కు నెగెటివ్ నిర్ధార‌ణ అయిందంటూ తెలిపారు. ఈ సందర్బంగా ఓ నోట్‌ను విడుదల చేస్తూ.. 'ప్రతి ఒక్క‌రికీ హాయ్‌.. 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు క‌రోనా నెగెటివ్ నిర్ధార‌ణ అయింది. నేను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన‌ నా శ్రేయోభిలాషుల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. క‌రోనా కేసులు త‌గ్గ‌డానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను. అంద‌రూ సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండండి. మీరు చూపిస్తోన్న ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని తెలిపారు.

    క్వారంటైన్ సమయంలో పిల్లలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్.. కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తొలిసారి పిల్లలను కలిసారు. దాదాపు రెండు వారాలు పిల్లలకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ ఒక్కసారిగా పిల్లలను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. తాను మాత్రమే కాకుండా... పిల్లలు కూడా అదే రకంగా నాన్నను చూడగానే అదే విధంగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


    నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. దీనికి సంబంధించి ఈ సినిమా నిర్మాత వై.రవిశంకర్‌ మాట్లాడుతూ.. ఎంతో స్పాన్‌ ఉన్న ఈ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే హీరో అల్లు అర్జున్‌, సుకుమార్‌గారితో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించాం.. అని పేర్కోన్నారు. మొదటి భాగం పూర్తి కాగానే రెండో భాగం మొదలుపెడతాం. ప్రస్తుతానికి రెండో భాగంలో పది శాతం చిత్రీకరణ పూర్తయింది అని నిర్మాత వై.రవిశంకర్‌ తెలిపారు. ఇక ఈ సినిమాలో విలన్’గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.

    Allu Arjun Sukumar Pushpa to release in two parts, Allu Arjun pushpa shoot halted, Pushpa teaser, pushpa team starts dubbing, Allu Arjun pushpa update, Allu Arjun pushpa news, tamil nadu shoot, sunil charecter, dhanujay, vijay sethupathi, pushpa item song, kiara advani, urvasi rautela, Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, కియారా అద్వానీ, ఊర్వశి రౌటెలా,
    Allu Arjun in Pushpa Photo : Twitter


    తాజా షూట్‌లో ఫహద్ ఫాజిల్ పాల్గోన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక మందన చేస్తోంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృదం. యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్, అదిరే సౌండ్‌ట్రాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది టీజర్. ఈ టీజర్ ఇంకా యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. పుష్ప టీజర్ ఇప్పటివరకు 64 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో అత్యదిక వ్యూస్ పొందిన టీజర్‌గా నిలిచింది. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది.

    allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun pushpa movie,allu arjun pushpa movie teaser 60 million,allu arjun pushpa movie fastest 60 million views,allu arjun pushpa movie records,పుష్ప,పుష్ప సినిమా,అల్లు అర్జున్ పుష్ప రికార్డులు,పుష్ప టీజర్‌కు 60 మిలియన్స్
    అల్లు అర్జున్ పుష్ప సినిమా (Pushpa movie)


    ఈ సినిమా కూడా సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే వస్తోందట. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే ఓ స్మగ్లర్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన ట్రైబల్ యువతి పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: