అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో మెగా ఫ్యామిలీ..

అల వైకుంఠపురములో సినిమా విజయంతో జోరు మీదున్నాడు అల్లు అర్జున్. కొన్ని రోజులుగా సక్సెస్ సంబరాలు చేసుకుంటున్న అల్లు అర్జున్‌కు ఇప్పుడు పిడుగు లాంటి వార్త వచ్చింది. ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2020, 11:03 PM IST
అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో మెగా ఫ్యామిలీ..
అల్లు అర్జున్ మేనమామ మరణం
  • Share this:
అల వైకుంఠపురములో సినిమా విజయంతో జోరు మీదున్నాడు అల్లు అర్జున్. కొన్ని రోజులుగా సక్సెస్ సంబరాలు చేసుకుంటున్న అల్లు అర్జున్‌కు ఇప్పుడు పిడుగు లాంటి వార్త వచ్చింది. ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. విజయానందంలో తేలిపోతున్న ఈ కుటుంబంలో ఓ వ్యక్తి తగ్గిపోయాడు. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం పాలయ్యాడు. ఇది అల్లు ఫ్యామిలీకి షాకింగ్‌గా మారింది. అనుకోకుండా వచ్చిన ఈ పిడుగు లాంటి వార్త ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి చేదు గుళికగా మారిపోయింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు ఈయన మేనమామ నిర్మాతగా కూడా ఉన్నారు.
Allu Arjun Uncle and AA 20 movie producer Muttamsetty Rajendra Prasad Dies Of Heart Attack pk అల వైకుంఠపురములో సినిమా విజయంతో జోరు మీదున్నాడు అల్లు అర్జున్. కొన్ని రోజులుగా సక్సెస్ సంబరాలు చేసుకుంటున్న అల్లు అర్జున్‌కు ఇప్పుడు పిడుగు లాంటి వార్త వచ్చింది. ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. Allu Arjun,Allu Arjun uncle dies,Allu Arjun uncle dies heart attack,allu arjun Muttamsetty Rajendra Prasad,Muttamsetty Rajendra Prasad death,Muttamsetty Rajendra Prasad heart attack,telugu cinema,aa 20 movie producer Muttamsetty Rajendra Prasad,అల్లు అర్జున్,అల్లు అర్జున్ మేనమామ మరణం,అల్లు అర్జున్ మేనమామ గుండెపోటుతో మృతి,ముత్తంశెట్టి ప్రసాద్ మరణం,తెలుగు సినిమా
అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ప్రారంభం (Twitter/Photo)

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు ముత్తంశెట్టి ప్రసాద్. ప్రస్తుతం ఈ చిత్ర పనుల్లోనే బిజీగా ఉన్న బన్నీకి మేనమామ మరణం అనుకోని షాక్. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలా దేవికి అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య ఈయన. చిన్నప్పటి నుంచి కూడా మేనమామతో చాలా సన్నిహితంగా ఉన్నాడు బన్నీ. ఇప్పుడు ముత్తంశెట్టి ప్రసాద్ మరణవార్త అల్లు కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. విజయవాడలో జనవరి 22న ఈయన కన్నుమూసారు. ఈ విషయం తెలియగానే అల్లు కుటుంబం అంతా అక్కడికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోని పలువురు కూడా ఈయన కుటుంబానికి సంతాపం తెలియచేసారు.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు