news18-telugu
Updated: May 16, 2020, 5:03 PM IST
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు నెలకొంది. ఇప్పట్లో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కావకపోవచ్చు. వివరాల్లోకి వెళితే.. సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అంతేకాదు నాన్ బాహుబలి పేరిట ఉన్న రికార్డలను ఈ సినిమా తిరగరాసింది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములో, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ పెద్ద హిట్టైయ్యాయి. విడుదలైన తర్వాత అల వైకుంఠపురములో పాటలు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 172 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు ఈ సినిమాలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలతో పాటు ఇండియాలోని టాప్ సెలబ్రిటీలు కూడా డాన్సులు చేస్తున్నరంటే ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.

100 కోట్ల వ్యూస్ రాబట్టిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మ్యూజిక్ ఆల్బమ్ (Twitter/Photo)
తాజాగా ఈసినిమాలోని రాములో రాములో ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంతకు ముందు రాములో రాములో లిరికల్ వీడియో సాంగ్ 260 వ్యూస్ రాబట్టింది. మొత్తంగా 350కి పైగా మిలియన్ వ్యూస్ సంపాదించింది. తాజాగా ఈ సినిమాలోని అన్ని పాటలు కలిసి 1 బిలియన్ వ్యూస్ రాబట్టినట్టు యూట్యూబ్ తెలిపింది. మొత్తంగా ఒక సినిమాలోని పాటల ఆల్బమ్ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్స్ అన్ని కలిసి 100 కోట్ల వ్యూస్‌ను రాబట్టడం తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. ఈ రకంగా అల వైకుంఠపురములో సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ ఆల్బమ్ సక్సెస్ చేసినందుకు గీతా ఆర్ట్స్ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
May 16, 2020, 5:03 PM IST