‘అల..వైకుంఠపురములో’ అల్లు అర్జున్.. మరోసారి సెంటిమెంట్‌ను నమ్ముకున్న త్రివిక్రమ్..
AlaVaikunthapuramlo | ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసారు. ఎప్పటిలాగే త్రివిక్రమ్ తనదైన మార్క్‌లో ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను అల్లు అర్జున్ సినిమాకు ఫిక్స్ చేసారు.
news18-telugu
Updated: August 15, 2019, 11:47 AM IST

‘అల.. వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)
- News18 Telugu
- Last Updated: August 15, 2019, 11:47 AM IST
లాస్ట్ ఇయర్ ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాడు. ఈ సారి కొడితే బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉండాలని కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. లేటైనా సరే త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పాడు.జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసారు. ఎప్పటిలాగే త్రివిక్రమ్ తనదైన మార్క్‌లో ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను అల్లు అర్జున్ సినిమాకు ఫిక్స్ చేసారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ‘అ’ అనే అక్షరం అనే సెంటిమెంట్ ఉంటి. మొదట్లో ఈ సెంటిమంట్‌ను అంతగా ఫాలో కాకపోయినప్పటికీ... పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తరువాత తెరకెక్కించిన తన సినిమాలన్నింటికీ ‘అ’ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌నే ఎంపిక చేసుకుంటూ వచ్చాడు త్రివిక్రమ్.
‘అ.. ఆ’,‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత వీర రాఘవ’... ఈ కోవలోకే వస్తాయి. ఇందులో అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా... మిగతా మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా కొత్త సినిమాకు కూడా ‘అ’ అక్షరంతో మొదలయ్యేటట్టు ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇక్కడు అల వైకుంఠపురము అంటే ఒక ఇల్లు అన్నట్టు టైటిల్లో చూపించారు. ఒక ఇంట్లో జరిగే కథనే ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేసారు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌తో తీస్తోన్న ఈ మూడో సినిమాతో త్రివిక్రమ్ హాట్రిక్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

బ్యూటీఫుల్ నివేథాకు అల వైకుంఠపురములో టీమ్ విషేస్..
అల్లుఅర్జున్ కోసం ఆ తెలుగు పాప్ సింగర్ ఏం చేసిందో తెలుసా...?
రాములో రాములా వచ్చేసాడు.. రచ్చ చేసిన అల్లు అర్జున్ అండ్ టీం..
అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ వచ్చేసింది..
‘అల వైకుంఠపురం’లో అదిరిపోయే పాట... సామజవరగమన అంటూ...
అల్లు అర్జున్ సామజవరగమన.. అల వైకుంఠపురములో మెలోడీ..
Loading...