త్రివిక్రమ్ సెంటిమెంట్‌కు ఓకే చెప్పిన అల్లు అర్జున్

అల్లు అర్జున్,త్రివిక్రమ్ కొత్త సినిమాకు నాన్న నేను అనే టైటిల్ ఓకే అయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మరో టైటిల్ ఫిక్స్ అయ్యింది.

news18-telugu
Updated: August 14, 2019, 1:33 PM IST
త్రివిక్రమ్ సెంటిమెంట్‌కు ఓకే చెప్పిన అల్లు అర్జున్
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
  • Share this:
సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లుకు కేరాఫ్ అడ్రస్. కథ, కథనం, స్టార్స్... ఇలా ఎన్ని ఉన్నా... సెంటిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు సినీజనం. ఏదేమైనా... తమకు కలిసొచ్చిన సెంటిమంట్‌ను వదులుకోవడానికి అస్సలు అంగీకరించరు. టాలీవుడ్ స్టార్ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ కోవలోకే వస్తారని చెప్పుకొవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అ అనే అక్షరం ఓ సెంటిమెంట్. మొదట్లో ఈ సెంటిమంట్‌ను అంతగా ఫాలో కాకపోయినప్పటికీ... అత్తారింటికి దారేది సినిమా తరువాత తెరకెక్కించిన తన సినిమాలన్నింటికీ అ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌నే ఎంపిక చేసుకుంటూ వచ్చాడు త్రివిక్రమ్.

అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత... ఈ కోవలోకే వస్తాయి. ఇందులో అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా... మిగతా మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అనిపించుకున్నాయి. దీంతో ఆయన తీయబోయే కొత్త సినిమా టైటిల్ కూడా అ అనే అక్షరంతోనే మొదలవుతుందని చాలామంది భావించారు. అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ... త్రివిక్రమ్ కచ్చితంగా మళ్లీ తన సక్సెస్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతారని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా నమ్మాయి.

అయితే ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్ ఓకే అయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో కొత్త సినిమా కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ను పక్కనపెట్టాడని టాక్ కూడా వినిపించింది. కథకు తగ్గట్టుగా ఉండటం వల్లే ఈ టైటిల్‌కు మాటల మాంత్రికుడు ఓకే చేశారని ప్రచారం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం తన కొత్త సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ మరోసారి తన మాట నెగ్గించుకున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ కొత్త సినిమాకు నేను నాన్న అనే టైటిల్ అనుకున్నా... చివరకు త్రివిక్రమ్ సూచించిన అలా వైకుంఠపురం అనే టైటిల్‌కే చిత్ర యూనిట్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ టైటిల్ లోగోను అఫీషియల్‌గా ఆవిష్కరించబోతున్నట్టు టాక్. మొత్తానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తొలిసారి సక్సెస్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న మాటల మాంత్రికుడు... మరోసారి బన్నీకి హిట్ ఇస్తాడేమో చూడాలి.






First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...