అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమాలో అక్కినేని మేన‌ల్లుడు కీ రోల్..

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కావాలంటే వార‌స‌త్వం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. అది లేకే చాలా మంది కుర్ర హీరోలు అలా మిగిలిపోతున్నారు. ఇప్పుడు మ‌రో హీరో కూడా ఇదే చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 7, 2019, 10:19 AM IST
అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమాలో అక్కినేని మేన‌ల్లుడు కీ రోల్..
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
  • Share this:
ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కావాలంటే వార‌స‌త్వం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. అది లేకే చాలా మంది కుర్ర హీరోలు అలా మిగిలిపోతున్నారు. ఇప్పుడు మ‌రో హీరో కూడా వ‌ర‌స‌గా ట్రై చేసి చేసి చివ‌రికి ఇప్పుడు కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిపోతున్నాడు. అత‌డే అక్కినేని మేన‌ల్లుడు సుశాంత్. కాళిదాసు సినిమాతో ప‌దేళ్ల కిందే హీరో అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా కొట్ట‌లేక‌పోయాడు సుశాంత్. చిల‌సౌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నా కూడా హిట్ రాలేదు. దాంతో ఇప్పుడు ఈ కుర్ర హీరో స‌పోర్టింగ్ రోల్స్ వైపు వెళ్తున్నాడు. తాజాగా త్రివిక్ర‌మ్, బ‌న్నీ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు ఈయ‌న‌.ఇదే విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసాడు కూడా. తాను అల్లు అర్జున్ సినిమాలో న‌టిస్తున్నాన‌ని ట్విట్ట‌ర్లో అనౌన్స్ చేసాడు సుశాంత్. త్రివిక్ర‌మ్ స‌ర్.. బ‌న్నీతో వ‌ర్క్ చేయ‌డం నిజంగా ఆనందంగా ఉందంటున్నాడు. తొలిరోజు సెట్‌లో స‌ర‌దాగా గ‌డిచింద‌ని చెప్పాడు సుశాంత్. ఇంత పెద్ద సినిమాలో తొలిసారి న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని.. అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు అక్కినేని హీరో. త‌న కెరీర్లో మ‌రో కొత్త ప్ర‌యాణం మొద‌లుపెడుతున్నాన‌ని.. స‌క్సెస్ అవుతాన‌నే భావిస్తున్నట్లు చెప్పాడు ఈయ‌న‌. మొత్తానికి చూడాలిక‌.. సుశాంత్ కెరీర్ ఈ చిత్రం త‌ర్వాత ఎలా ఉండ‌బోతుందో..?
First published: June 7, 2019, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading