అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే జరుగుతుంది. నా పేరు సూర్య తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న బన్నీ.. త్రివిక్రమ్ సినిమాను ఈ మధ్యే మొదలు పెట్టాడు. ఇప్పటికే షూటింగ్ కూడా దాదాపు 40 శాతం పూర్తైపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ విడుదల తేదీ కూడా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 15న ఈ టైటిల్ గురించి చెప్పనున్నారు మేకర్స్. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసారు. మరోసారి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతోనే రాబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ టైటిల్ అనౌన్స్మెంట్
అరవింద సమేతలో ఫ్యాక్షనిజం అంటే ఎలా ఉంటుందో చాలా ఏళ్ళ తర్వాత మరోసారి రుచి చూపించాడు మాటల మాంత్రికుడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 90 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు తనకు కలిసొచ్చిన హీరోతో కలిసి వస్తున్నాడు త్రివిక్రమ్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్నీతో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది. దీనికి నేను నాన్న అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఇదే కన్ఫర్మ్ మాత్రం కాదు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. థమన్ మరోసారి త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి 2020కు ఈ చిత్రం విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:August 12, 2019, 17:57 IST