Ala Vaikunthapurramloo: విడుదలై యేడాది దాటిన ఆగని అల వైకుంఠపురములో రికార్డులు ఇంకా ఆగడం లేదు. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు నమోదైంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రలో బుట్టబొమ్మ సాంగ్ 587 మిలియన్ వ్యూస్ క్రాస్ చేస్తూ 600 మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతుంది. మరోవైపు రాములో రాములో పాట 338 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరోవైపు సామజవరగమన పాట కూడా 176 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ 1 బిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
తాజాగా ఈ సినిమాలోని మ్యూజిక్ ఆడియో ఆల్బమ్ మరో రికార్డు దక్కించుకుంది. తెలుగు సినిమాల్లోనే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఏ ఆల్బమ్‌కు దక్కని స్పందన ఈ సినిమా ఆల్బమ్‌కు దక్కించుకుంది. తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా ఆల్బమ్ 2 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసింది. దక్షిణాదిలో ఫస్ట్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా ఒక సినిమాలోని పాటల ఆల్బమ్ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్స్ అన్ని కలిసి 200 కోట్ల (2 బిలియన్) వ్యూస్‌ను రాబట్టడం తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. ఈ రకంగా అల వైకుంఠపురములో సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Pooja Hegde, Tollywood, Trivikram