హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun Butta Bomma Song: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. 600 మిలియన్ క్లబ్బులో బుట్టబొమ్మ పాట సంచనలం..

Allu Arjun Butta Bomma Song: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. 600 మిలియన్ క్లబ్బులో బుట్టబొమ్మ పాట సంచనలం..

600 మిలియన్ క్లబ్బులో బుట్టబొమ్మ సాంగ్ (Twitter/Photo)

600 మిలియన్ క్లబ్బులో బుట్టబొమ్మ సాంగ్ (Twitter/Photo)

Allu Arjun - Trvikram - Pooja Hegde - Butta Bomma Song 600 Million Views: గతేడాది సంక్రాంతికి  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ 600 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

ఇంకా చదవండి ...

  Allu Arjun - Trvikram - Pooja Hegde - Butta Bomma Song 600 Million Views: గతేడాది సంక్రాంతికి  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం తెలుగులో ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ తమన్  కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ ఈ ఆల్బమ్. సినిమా పరంగా దుమ్ము దులిపేసిన అల వైకుంఠపురములో పాటల విషయంలో కూడా సంచలనం సృష్టిస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ. 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 2020 టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమన్ కెరీర్‌లోనే ఇంతకంటే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇక ఇవ్వలేడేమో అనేంతగా రెచ్చిపోయారు. ఆ ట్యూన్స్ ఇప్పటికీ రప్ఫాడిస్తున్నాయి. పైగా కేవలం దీని కోసమే అప్పట్లో మ్యూజికల్ నైట్ కూడా చేసారు త్రివిక్రమ్. తన సినిమాకు టికెట్స్ తెగడంలో తమన్ పాత్ర చాలా ఉందని క్రెడిట్ కూడా ఇచ్చాడు మాటల మాంత్రికుడు.

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్ స్వరపరిచిన పాటలకు అల్లు అర్జున్, పూజా హెగ్డే  డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ‘బుట్ట బొమ్మ సాంగ్ దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఇదే సినిమాలోని ‘రాములో రాములో’ పాట ఎనిమిదవ స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు 2020లో ఇండియా టాప్ 10 సాంగ్స్ లిస్టులో ఉన్న ఏకైక తెలుగు చిత్రం కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ కావడం విశేషం.

  రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది. ఈ పాట మొదట్లో కాస్త నెమ్మదిగానే అనిపించినా.. ఆ తర్వాత మాత్రం దుమ్ము దులిపేసింది. నిదానమే ప్రధానం అన్నట్లు.. టిక్ టాక్, డబ్ స్మాష్ ఎక్కడ చూసినా కూడా బుట్టబొమ్మే దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ పాట మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 600 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. మరో 200 మిలియన్స్ అందుకోడానికి నాలుగు నెలల సమయం తీసుకుంది. 500 మిలియన్ వ్యూస్ అంటే జనవరి 7న క్రాస్ చేసింది. తాజాగా ఈ పాట 600 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది.

  Allu Arjun Trivikram Pooja Hegde Ala Vaikuntapurramloo Butta Bomma Song
  600 మిలియన్ క్లబ్బులో అల్లు అర్జున్, పూజా హెగ్డే ‘బుట్ట బొమ్మ’ సాంగ్ (Twitter/Photo)

  జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఓమై గాడ్ డాడీ, టైటిల్ సాంగ్‌, సిత్తరాల సిరపడు పాటలు కూడా సంచలనం విజయం సాధించాయి. మొత్తానికి తమన్, అల్లు అర్జున్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ సహా అందరి కెరీర్‌లో అల వైకుంఠపురములో అలా ప్రత్యేకంగా నిలిచిపోయింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Pooja Hegde, Tollywood, Trivikram

  ఉత్తమ కథలు