ALLU ARJUN TRIVIKRAM MOVIE STILL NOT STARTED AND BUNNY MISSING THIS YEAR FOR THE 1ST TIME IN HIS CAREER PK
అల్లు అర్జున్ @ 2019.. కెరీర్లో తొలిసారి అలా చేస్తున్న బన్నీ..
అల్లు అర్జున్ న్యూ స్టిల్స్
అల్లు అర్జున్ కెరీర్ మొదలై ఇప్పటి వరకు 16 ఏళ్లైంది. ఈ మధ్యే తన 16 ఏళ్ల పండగ కూడా చేసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన కెరీర్లో ఎన్నడూ లేని ఓ రికార్డుకు ఇప్పుడు చేరువవుతున్నాడు బన్నీ.
అల్లు అర్జున్ కెరీర్ మొదలై ఇప్పటి వరకు 16 ఏళ్లైంది. ఈ మధ్యే తన 16 ఏళ్ల పండగ కూడా చేసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన కెరీర్లో ఎన్నడూ లేని ఓ రికార్డుకు ఇప్పుడు చేరువవుతున్నాడు బన్నీ. అది కూడా 2019లోనే వచ్చేలా కనిపిస్తుంది. దాంతో అభిమానులు కూడా ఈ రికార్డ్ రాకూడదని కోరుకుంటున్నారు. కానీ అది మాత్రం వచ్చేలా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే బన్నీకి టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. డిజే సినిమా యావరేజ్.. ఆ తర్వాత వచ్చిన నా పేరు సూర్య ఫ్లాప్.. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు బన్నీ.
అల్లు అర్జున్
ఇలాంటి టైంలో 2019 ఈయన కెరీర్లో ఖాళీగా మిగిలిపోయేలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈయన కెరీర్ మొదలైన తర్వాత ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోలేదు. తొలిసారి బన్నీ ఓ కాలెండర్ ఇయర్లో ఖాళీ తీసుకునేలా కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఈ పాటికే మొదలవ్వాల్సి ఉన్నా కూడా ఇంకా కాలేదు. ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ ఎప్పటికి మొదలవుతుందో చెప్పడం లేదు. మే రెండో వారంలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.
బన్నీ త్రివిక్రమ్ దేవీ
ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెట్టి.. ఎప్పటికి పూర్తి చేస్తాడనేది ఆసక్తికరమే. దాంతో ఈ ఏడాది ఈ చిత్రం రావడం దాదాపు అసాధ్యం. ఇదే కానీ జరిగితే 2003లో గంగోత్రి సినిమా నుంచి 2018లో నా పేరు సూర్య వరకు ప్రతీ ఏడాది కనీసం ఒక్క సినిమా విడుదల చేస్తూ వచ్చిన బన్నీ కెరీర్లో తొలిసారి ఓ కాలెండర్ ఇయర్ ఖాళీగా మారిపోనుంది. మరి ఈ కోరుకోని రికార్డు నుంచి అల్లు అర్జున్ తప్పుకుంటాడో లేదో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.