పట్టాలెక్కిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూవీ..

సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు ప్రారంభమైన ఈ సినిమా ఈ రోజు సెట్స్ పైకి వెళ్లింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 24, 2019, 12:41 PM IST
పట్టాలెక్కిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూవీ..
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
  • Share this:
లాస్ట్ ఇయర్  ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విపలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ సారి కొడితే బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉండాలని కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. లేటైనా సరే త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పాడు.జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఆల్రెడీ పూజా కార్య్రమాలు ప్రారంభమైన ఈసినిమా ఈ రోజు నుంచి సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న తమన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు.హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19వ సినిమా. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆయన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ  మూవీలో అల్లు అర్జున్ జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు టబు అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ‘అలకనందా’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈసినిమాను గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేలా షూట్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్, అల్లు అర్జున్‌లు హాట్రిక్ నమోదు చేస్తారా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 24, 2019, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading