అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా సెట్స్‌ పైకి వెళ్లేది అపుడే...

అల్లు అర్జున్, త్రివిక్రమ్

Allu Arjun Trivikram | ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా  ప్రకటించిన ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే డేట్‌ను కన్ఫామ్ అయింది.

  • Share this:
లాస్ట్ ఇయర్  ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విపలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ సారి కొడితే బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉండాలని కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. లేటైనా సరే త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పాడు.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా  ప్రకటించిన ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌ను మార్చి నుంచి సెట్స్‌పైకి తీసుకువెళతారట. ఈసినిమాలో కథానాయికగా కియరా అద్వానీ పేరును పరీశీలిస్తున్నారు. ఒకవేళ కియరా కాకపోతే మరో పెద్ద హీరోయిన్‌నే ఈ సినిమాలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి ఈ సినిమాతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ నమోదు చేస్తారో లేదో చూడాలి.

పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్


ఇవి కూడా చదవండి 

’మన్మథుడు 2’కు ఓకే చెప్పిన నాగార్జున..ఇంతకీ వర్కౌట్ అవుతుందా..

‘F2’ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న అనిల్ రావిపూడి..ఇంతకీ హీరోలెవరో తెలుసా..

ఆ పనిని ఎంజాయ్ చేయలేనంటున్న నటి రాధికా ఆప్టే

 

 
First published: