అభిమానులకు అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్..త్రివిక్రమ్‌తో నెక్ట్ ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేసిన బన్ని

ఈ యేడాది అల్లు అర్జున్...వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విపలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తాజాగా కొత్త యేడాదికి కొన్ని గంటల ముందు అల్లు అర్జున్, మాటల మాంత్రికుడితో తన కొత్త ప్రాజెక్ట్ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.

news18-telugu
Updated: December 31, 2018, 2:35 PM IST
అభిమానులకు అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్..త్రివిక్రమ్‌తో నెక్ట్ ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేసిన బన్ని
అల్లు అర్జున్, త్రివిక్రమ్
  • Share this:
ఈ యేడాది అల్లు అర్జున్...వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విపలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ సారి కొడితే బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉండాలని కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. లేటైనా సరే లేటెస్ట్ స్టోరీతో అభిమానులను అలరించేందకు రెడీ అవుతున్నాడు బన్ని.

తాజాగా కొత్త యేడాదికి కొన్ని గంటల ముందు అల్లు అర్జున్, మాటల మాంత్రికుడితో తన కొత్త ప్రాజెక్ట్ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.
గత కొన్ని రోజులుగా బన్ని, త్రివిక్రమ్ మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది. రీసెంట్‌గా ‘వినయ విధేయ రామ’ ఆడియో ఫంక్షన్‌లో మెగాస్టార్‌తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉండదని అందరూ అనుకున్నారు.

త్రివిక్రమ్‌తో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అర్జున్


కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్‌తోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు బన్ని . ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ బాలీవుడ్‌లో హిట్టైన ‘సోను కే టీటూ కీ స్వీటి’ మూవీకి రీమేక్ అని చెబుతున్నారు. మొత్తానికి నిరీక్షణకు తెరదించుతూ త్రివిక్రమ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయడం చూసి బన్ని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన కైరా అద్వానీని కథానాయికగా అనుకుంటున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ మూవీతోనైనా బన్ని బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.ఇది కూడా చదవండి 

సెన్సార్ సమస్యల్లో ఎన్టీఆర్ బయోపిక్... కారణం ఎవరు?

ఈ వ‌య‌సులో కాక‌పోతే ఇంకెప్పుడు అంటున్న ర‌కుల్..

#FlashBack2018: 2018 స‌ర్‌ప్రైజింగ్ స్టార్స్ ఎవ‌రో తెలుసా..?

 
First published: December 31, 2018, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading