‘అల వైకుంఠపురములో’ సినిమాకు అదే శాపం కానుందా..

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.తాజాగా ఈ సినిమాకు అదే శాపం కానుందా..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 24, 2019, 11:48 AM IST
‘అల వైకుంఠపురములో’ సినిమాకు అదే శాపం కానుందా..
అల్లు అర్జున్ (Twitter/Photo)
  • Share this:
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి నిడివి పెద్ద ప్రాబ్లెమ్ కానుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సినిమా కథ,స్క్రీన్ ప్లే బాగుంటతే.. రన్ టైమ్ కాస్తా ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు ఓపికతో ఆదిరిస్తారు. ఏ మాత్రం కాస్తా అటూ ఇటూ అయినా సినిమా సంగతులు అంతే. ఏవో అపుడపుడు అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు వీటికి మినహాయింపు అని చెప్పాలి. అదే మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి రన్ టైమ్‌ ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు కాస్తా ప్రతికూలంగా మారింది.

Allu Arjun Ala Vaikunthapurramuloo Teaser will be coming your way at 10 AM Dec 8th pk అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ala vaikunthapuramulo,ala vaikunthapuramulo movie,ala vaikunthapuramulo movie teaser,ala vaikunthapuramulo movie teaser dec 8th,ala vaikunthapuramulo shooting,allu arjun ala vaikunthapuramulo,ala vaikunthapuramulo dubbing work,ala vaikunthapuramulo sushanth dubbing started,ala vaikunthapuramulo movie shooting,ala vaikunthapuramulo allu arjun pooja hegde,ala vaikunthapuramulo trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో టీజర్,అల వైకుంఠపురములో అల్లు అర్జున్ పూజా హెగ్డే,అల్లు అర్జున్ సుశాంత్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో డబ్బింగ్ మొదలు
అల వైకుంఠపురములో’ సినిమా సెట్‌లో అల్లు అర్జున్‌కు సీన్ వివరిస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)


తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమాను అల్లు అర్జున్‌కు త్రివిక్రమ్ 2 గంటల 25 నిమిసాలు అని చెప్పాడట. తీరా ఫైనల్ కట్ చేస్తే.. 3 గంటలకు పైగా వచ్చిందట. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు కామెడీ,యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయని సమాచారం. ఇక అల్లు అర్జున్ గత చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కు రన్ టైమ్ ఎక్కువ కావడం వల్లే సినిమా పోయిందని చెబుతున్నారు. మొత్తానికి 2020 సంక్రాంతికి విడుదల కానున్న ఈ  చిత్రాన్ని త్రివిక్రమ్ ఎంత నిడివితో రిలీజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 24, 2019, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading