‘అల వైకుంఠపురములో’ డిజిటల్ ఫ్లాట్‌‌ఫామ్‌లోకి వచ్చే డేట్ ఫిక్స్..

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ రేసు గుర్రంలా పరుగులు పెడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యే తేది ఫిక్స్ అయింది.

news18-telugu
Updated: February 3, 2020, 5:25 PM IST
‘అల వైకుంఠపురములో’ డిజిటల్ ఫ్లాట్‌‌ఫామ్‌లోకి వచ్చే డేట్ ఫిక్స్..
అల వైకుంఠపురములో
  • Share this:
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ రేసు గుర్రంలా పరుగులు పెడుతూనే ఉంది. ఈ సినిమా మూడు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్‌కు తీసుకొచ్చిన ఈ చిత్రం మూడో వారం కూడా కుమ్మేసింది. కేవలం మూడో వారంలోనే రూ. 9 కోట్ల షేర్ వసూలు చేసింది అల వైకుంఠపురములో. ఇప్పటి వరకు 22 రోజుల్లోనే ఈ చిత్రం రూ.152 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. నాన్ బాహుబలిలో అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు బన్నీ. ముఖ్యంగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర సరైనోడు అనిపించుకున్నాడు.

అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)


నైజాంలో అయితే ఏకంగా రూ.40 కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డులకు తెరతీసాడు అల్లు అర్జున్. బాహుబలి కాకుండా మరో సినిమా ఏదీ నైజాంలో 35 కోట్ల మార్క్ అందుకోలేదు. మొత్తంగా ఏపీ తెలంగాణలో 125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.ఇక ఓవర్సీస్‌లో 18.50 కోట్ల మార్క్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్నాడు బన్నీ. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చే డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను డిజిటల్ శాటిలైట్ హక్కులను జెమిని వాళ్లు భారీ రేటుకే కొనుగోలు చేసారు. ముందుగా చేసుకున్న ఒప్పందంచేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. అంటే సినిమా విడుదలైన 87 రోజుల తర్వాత ఈ సినిమా ప్రసారం కానుంది. మొత్తంగా థియేటర్‌లో ఈ సినిమా చూడలేని వాళ్లు ఎంచక్కా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో చూడాలంటే ఏప్రిల్ 8వ వరకు ఓపిక పట్టాల్సిందే.

First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు